AP BJP: బీజేపీ ఐదో జాబితా విడుదల.. ఏపీ అభ్యర్థులు వీళ్లే..

మొత్తం 111 మంది పేర్లతో ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో ఏపీలో పోటీచేయబోయే ఆరు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. అలాగే తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.

Post Published By: narender Thiru
Updated : 24 March 2024, 9:19 PM IST

AP BJP: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఐదో జాబితాను బీజేపీ.. ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం 111 మంది పేర్లతో ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో ఏపీలో పోటీచేయబోయే ఆరు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. అలాగే తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజాగా వైసీపీని వీడి కమలం పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తిరుపతి లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అలాగే బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్‌కు వరంగల్ టిక్కెట్ దక్కింది. పార్లమెంట్ సీట్లు దక్కని కొందరు సీనియర్లను అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించింది.
తెలుగు రాష్ట్రాల తాజా జాబితా ఇది.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు
అరకు - కొత్తపల్లి గీత
అనకాపల్లి - సీఎం రమేష్
రాజమండ్రి - డి. పురంధేశ్వరి
నర్సాపురం - భూపతిరాజు శ్రీనివాస్ వర్మ
తిరుపతి - వరప్రసాద రావు
రాజంపేట - ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు
వరంగల్ (ఎస్సీ)-ఆరూరి రమేశ్
ఖమ్మం-తాండ్ర వినోద్ రావు

 

Published : 
  • 24 March 2024, 9:19 PM IST