BRS New Manifesto.. Description of Schemes.
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం మరింత పెంచింది. నేటి నుంచి అధికారికంగా కేసీఆర్ ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది అని చెప్పవచ్చు. ఇవాళ ఒక్కరోజు 51 ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ అందించింది. ఇవాళ సాయంత్రం హుస్నాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభ ద్వారా తెలంగాణలో ఎన్నికలు మరింత ఊపు తెచ్చేలా ఉన్నాయి. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో వివరణ..
హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు..
అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాలు..
దళితబంధును కొనసాగిస్తాం..
రైతుబంధును రూ.16 వేలు చేస్తాం..
ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెన్షన్.. పెంపు మొత్తం రూ.5000లకు పెంపు..
అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి..
పేద మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్..
దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంపు..
పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి..
కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది..
గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం..
ఆరోగ్య శ్రీ 15 లక్షలకు పెంపు..
తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం..
బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం..
అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్..
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ భరోసా..
అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత..
నూతన పథకం..
అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ..
తెలంగాణ అన్నపూర్ణ పథకం : కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు సన్నబియ్యం..
కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం : పేదలకు కేసీఆర్ బీమా
S.SURESH