పొజిషన్ అయినా.. అపోజిషన్ అయినా.. ప్రత్యర్థి ఎవరైనా సరే.. వన్స్ ఐ స్టెపిన్.. అన్న బాలకృష్ణ సినిమా డైలాగ్‌ని ఆయనకే మరోసారి గుర్తు చేస్తున్నారట హిందూపురంలోని ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఎంపీ సీటుకు పోటీ చేస్తే.. ఆ లెక్కే వేరంటున్నారట. ఈసారి టిక్కెట్ల కేటాయింపుపై టీడీపీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న టైంలో బాలకృష్ణ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వైపు చూస్తే బాగుంటుందన్నది వారి అభిప్రాయంగా చెబుతున్నారు. అలా ఎందుకంటే ఆ లెక్క కూడా పక్కాగానే ఉంది.. 2019 జగన్ వేవ్‌లో హిందూపురంలో తొడ గొట్టారు బాలయ్య. ఇంకా చెప్పాలంటే.. 2014 కంటే మెజార్టీ పెరిగింది.
Cine actor, Hindupuram MLA, Balakrishna is going to contest as MP in AP Lok Sabha elections