హీరోయిన్ కేసు: ఐపిఎస్ కు రిలీఫ్

ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్ట్ లో ఊరట లభించింది. జిత్వానీ కేసులో గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.

Post Published By: Vencateshg
Updated : 25 September 2024, 1:31 PM IST

ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్ట్ లో ఊరట లభించింది. జిత్వానీ కేసులో గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అక్టోబర్ 1వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో ఉన్న మరో ఐపిఎస్ అధికారి కాంతి రానా కూడా హైకోర్ట్ కి వెళ్ళారు.

తనను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని తాను పై అధికారుల ఆదేశాల మేరకే ఆమెను అదుపులోకి తీసుకున్నాను అని వెల్లడించారు. విచారణ జరిపిన కోర్ట్ అక్టోబర్ 1కి కేసు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనపై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Published : 
  • 25 September 2024, 1:31 PM IST