పాపం రజనీ… అంబటి కన్నీళ్లు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం మా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారన్న ఆయన... వైసీపీ కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారని ఆరోపించారు.

Post Published By: Vencateshg
Updated : 11 November 2024, 4:16 PM IST

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం మా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారన్న ఆయన... వైసీపీ కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై సుమోటాగా కేసు పెట్టడం ఏంటి అని నిలదీశారు. కేసులకు భయపడకుండా కాంగ్రెస్ పెద్దలకు ఎదురు తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం లో వున్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులు అంటూ వ్యాఖ్యలు చేసాడని ఆయన చేసిన వ్యాఖ్యలు పై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా అని ప్రశ్నించారు. మాజీమంత్రి విడుదల రజీని పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టారన్నారు అంబటి. సుమోటోగా కేసులు నమోదు చేయాలంటే పవన్ కళ్యాణ్ పై కూడా పెట్టొచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వం లో కీలక పోస్టింగ్ లో ఉన్న14 మంది ఐపీఎస్ లకు కూటమి ప్రభుత్వం లో పోస్టింగ్ లు ఇవ్వలేదని ఆరోపించారు.

Published : 
  • 11 November 2024, 4:16 PM IST