ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కుమార్తె, అంబటి మౌనికపై ప్రసంశల వర్షం కురిపించారు. అంబటి మౌనిక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు అంబటి. రాష్ట్రంలో మాజీ మంత్రుల నివాసాలపై దాడులు జరగడం అత్యంత సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కాపుల సహకారంతో సీఎం అయిన వ్యక్తి.. అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం తగదన్నారు ముద్రగడ. మేము పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వలసదారులం కాదు.. మమ్మల్ని బానిసలుగా చూడటం ఆపాలన్నారు. రేపు మీ కుటుంబ సభ్యులకు ఇలాగే జరిగితే మీ స్పందన ఏంటి..? అని నిలదీశారు. గతంలో నన్ను, నా భార్యను, పిల్లలను కూడా ఇలాగే నీచంగా హింసించారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.