Top story: బాబు రెడీ… సీఎం సీటుకి అడుగు దూరంలో లోకేష్….. చంద్రబాబు రూటు ఎటు…?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడీ కుమారుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి రంగం సిద్ధమవుతుందా? అందరూ ఊహించినట్లుగానే లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేతికొచ్చేసాయి.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 9:37 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడీ కుమారుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి రంగం సిద్ధమవుతుందా? అందరూ ఊహించినట్లుగానే లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేతికొచ్చేసాయి. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది సెమీఫైనల్స్ లాంటిది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం ద్వారా
కేడర్ కి, ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు. త్వరలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబోతున్నారనేది ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. రేపు ఎల్లుండో లోకేష్ ముఖ్యమంత్రి అయిన...ప్రజలు, మిగిలిన పార్టీలు పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేమీ ఉండదు. దీనికి కారణం... చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తారని రెండేళ్లుగా అందరినీ మానసికంగా ప్రిపేర్ చేసుకోవచ్చారు బాబు.

కుటుంబం నుంచి, పార్టీ నుంచి ఇప్పటికే పూర్తిగా రావడంతో లోకేష్ డీఫాక్టు చీఫ్ మినిస్టర్ గా రెండేళ్ల నుంచి వ్యవహరిస్తూనే ఉన్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన జనసేన, ఆ పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ ముఖ్యమంత్రిగా సీఎం కుర్చీలో కూర్చోవడానికి అంగీకరించారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు లోకేష్ కూడా తనకు కావలసిన గ్రౌండ్ ని పూర్తిస్థాయిలో ప్రిపేర్ చేసుకున్నారు. పార్టీలో... ప్రజల్లో ఆమోదముద్ర రావడానికి అన్ని రకాలుగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ప్రధానంగా లోకేష్ తన రూపంలో చాలా మార్పు సాధించారు.

సగం బరువు తగ్గిపోవడం ద్వారా శారీరకంగా చాలా ఆకర్షణీయంగా కనబడుతూ... లీడర్షిప్ క్వాలిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఆయన ప్రవర్తన... బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పు తెచ్చుకున్నారు. ఇటీవల జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవినింగ్ పార్టీలు నిర్వహించడం, కార్యకర్తలతో మమేకమవుతూ వాళ్లలో విపరీతంగా జోష్ నింపడం ఇవన్నీ లోకేష్ తనని తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరి చేత ఆమోదముద్ర పొందడానికి చేసిన కసరత్తులే. పార్టీలో యంగ్ లీడర్స్ తో పాటు సీనియర్లు కూడా లోకేష్ నాయకత్వాన్ని పదేపదే ప్రశంసిస్తున్నారు.

దాదాపుగా అందరూ లోకేష్ తమ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు కావలసిన గ్రౌండ్ ని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగాసిద్ధం చేశారు. ఎవ్వరు లోకేష్ ని నో అనే పరిస్థితి రాకుండా అన్ని చక్కదిద్దేశారు. లోకేష్ గూడా అన్ని శాఖలు తానే చూస్తూ, తరచూ ఢిల్లీ వెళ్తూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో మాట్లాడుతూ... తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్ని కార్నర్స్ లో లోకేష్ మాటే నడుస్తోంది. చిన్నాయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు... కు పదవులు రావడం... పార్టీలో గుర్తింపు రావడంతో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు రాజకీయం అనేది కూడా అందరిలోకి వెళ్లిపోయింది.

2027 లో లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, 2029 లో ఆయన నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.2018లో తెలంగాణలో రెండోసారి గెలిచిన తర్వాత బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ ని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు కానీ, ముఖ్యమంత్రిని చేయలేదు. ఆ తర్వాత 2023లో టిఆర్ఎస్ ఓడిపోయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి లోకేష్ ని సీఎం చేయడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ సీఎం అయితే చంద్రబాబు తర్వాత రాజకీయ పైన ఎలా ఉంటుంది? ఆయన రాష్ట్రపతిగా వెళ్తారా? రాజ్యసభ సీట్ తీసుకొని కేంద్రమంత్రి అవుతారా? లేక ఏదైనా పెద్ద రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారా.... ఇలా రకరకాల చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి.

Published : 
  • 17 April 2026, 9:37 AM IST