Top story: పీకే గెలుపు వెనక…బంకిపూర్ ఉపఎన్నికలో బిజెపికి షాక్.. ప్రశాంత్ కిషోర్ భారీ విజయం..!

బీజేపీ కంచుకోట బద్దలైంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజవర్గం బంకిపూరు ఉప ఎన్నిక లో కమలం ఓడిపోయింది. మొన్నటి వరకు ఎంతోమంది నేతలను తన వ్యూహాలతో అసెంబ్లీకి పంపిన ప్రశాంత్ కిషోర్.

Post Published By: dialnews
Updated : 4 August 2026, 10:16 AM IST

బీజేపీ కంచుకోట బద్దలైంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజవర్గం బంకిపూరు ఉప ఎన్నిక లో కమలం ఓడిపోయింది. మొన్నటి వరకు ఎంతోమంది నేతలను తన వ్యూహాలతో అసెంబ్లీకి పంపిన ప్రశాంత్ కిషోర్...మొట్టమొదటిసారి బీహార్ చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు. 30 ఏళ్లకు పైగా పైగా బీహార్ బంకీపూర్‌ సెగ్మెంట్‌ లో తిరుగులేని కాషాయదళం... పీకే చేతిలో చావు దెబ్బతింది.బీహార్‌లోని బంకీపూర్‌ ఉపఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నియోజకవర్గ బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోట. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇన్నాళ్లు బంకిపూర్ కి ప్రాతినిధ్యం వహించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్‌ నబీన్‌... ఆ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడయ్యారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకీపూర్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్‌ సురాజ్‌ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ బంకీపూర్‌లో స్వయంగా రంగంలోకి దిగారు.బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌పై 18 వే ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు.బంకీపూర్ నియోజకవర్గంలో అగ్రకుల ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇక్కడ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. నితిన్ నబీన్ కూడా ఇదే కులానికి చెందినవారు. బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజపుత్రులు, బనియాలతో కలిపి ఇక్కడ అగ్రవర్ణాల ఓట్ల శాతం దాదాపు 35శాతం నుంచి 40శాతం వరకు ఉంటుంది. సాంప్రదాయకంగా ఈ వర్గాలు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉంటూ వచ్చాయి.

2010 నుంచి 2025 వరకు వరుసగా 4 సార్లు నితిన్‌ నబీన్‌ విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గం పట్నా వెస్ట్‌గా ఉండేది. అప్పుడు కూడా బీజేపీదే హవా. నితిన్ నబీన్‌ తండ్రి నబీన్‌ కిషోర్‌ ప్రసాద్‌ సిన్హా కూడా నాలుగుసార్లు విజయం సాధించారు. ఇన్నాళ్లుగా బంకీపూర్‌లో ఎదురులేని బీజేపీకి ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బ.2025 నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జన్‌ సురాజ్‌ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ పోటీ చేయలేదు. రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సి ఉండటంతో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే... ఆ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఉపఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ప్రశాంత్‌ కిషోర్. ఏకంగా జాతీయాధ్యక్షుడి సొంత నియోజకవర్గం కోల్పోవడం బీజేపీకి మింగుడుపడటం లేదు.

బంకి పూర్ ఉప ఎన్నిక లో ప్రశాంత్ కిషోర్ గెలవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తొలితే ఇక్కడ బిజెపి అభ్యర్థిగా అభిషేక్ కుమారును ప్రకటించారు. అయితే దానాస్యంలో అతని బంధువుకు శిక్ష పడడంతో అభిషేక్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అవినీతిపై పోరాడిన భరతవారిని ఎన్కౌంటర్ చేయడం అగ్రవర్ణాల్లో అసంతృప్తిని రాజే చేసింది. హలో విద్యార్థులపై లాఠీచార్జి యువ ఓ టర్లలో ముకుతం బిజెపి అంటే విముఖతను పెంచింది. సామాజిక వర్గాల వారీగా పీకే ఎత్తుగడలు కూడా ఈ వ్యతిరేకతకు తోడయ్యాయి. నేర చరిత్ర ఉన్న సీఎం సామ్రాట్ చౌదరి పై బీహార్లో వ్యతిరేకత బంకిపూర్ ఉపఎన్నికలో బయటపడింది.

Published : 
  • 4 August 2026, 10:16 AM IST