Top story: జగన్‌ హిస్టరీ టార్గెట్ చేసిన బీటెక్ రవి… సొంత జిల్లాలో జగన్ కు లేని సపోర్ట్…వైసీపీ ఎందుకు లైట్ తీసుకుంది..? టీడీపీ స్కెచ్ ఏంటీ..? పులివెందుల పాలిటిక్స్‌లో “పుష్ప-3” రేంజ్ ఫైట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా రాయలసీమ గడ్డపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. పులివెందుల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రెస్ మీట్లు

Post Published By: dialnews
Updated : 29 May 2026, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా రాయలసీమ గడ్డపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. పులివెందుల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రెస్ మీట్లు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారాయి. "బయటకు తెలిసిన జగన్ వేరు.. లోపల ఉన్న జగన్ వేరు" అంటూ ఆయన బయటపెడుతున్న అంశాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.దీనికి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చినప్పటికీ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ బీటెక్ రవి కామెంట్స్‌ను జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్తోంది. అసలు బీటెక్ రవి చేసిన ఆ ఇబ్బందికర కామెంట్స్ ఏంటి? వైసీపీ ఎందుకు మొదట లైట్ తీసుకుని, ఆ తర్వాత అవినాష్ రెడ్డితో సీరియస్ వార్నింగ్ ఇప్పించింది?

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా బీటెక్ రవి వైఎస్ ఫ్యామిలీ హిస్టరీపై అత్యంత ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ కుటుంబం మూడు తరాలుగా హత్యా రాజకీయాల పునాదుల మీదే ఎదిగిందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. "రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి.. ఈ మూడు తరాల చరిత్ర రక్తచరిత్రే" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, పరిటాల రవి హత్య కేసులో, అలాగే సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం లేకుండా ఏమీ జరగలేదంటూ నేరుగా జగన్‌ను కడిగిపారేశారు. సొంత చెల్లి వైఎస్ షర్మిలకే వెన్నుపోటు పొడిచిన జగన్‌కు ఇతరుల గురించి మాట్లాడే అర్హత లేదంటూ నాని, వంశీల ప్రెస్ మీట్లకు కౌంటర్‌గా బీటెక్ రవి విరుచుకుపడ్డారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బీటెక్ రవి ఇంత పెద్ద ఎత్తున జగన్‌పై ఆరోపణలు చేస్తున్నా, వైసీపీ అగ్రనాయకత్వం లేదా ప్రధాన ప్రతినిధులు మొదట్లో దీనిపై పెద్దగా స్పందించలేదు. దానికి కారణం లేకపోలేదు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు ముందు బీటెక్ రవి క్యాడర్ చాలా తక్కువని, ఆయన మాటలను లైట్ తీసుకుంటే అవే సర్దుకుంటాయని వైసీపీ భావించింది. పైగా, రాష్ట్ర స్థాయి నేతలు కాకుండా కేవలం కడప జిల్లాకు పరిమితమైన నేత కామెంట్స్‌కు తాడేపల్లి నుంచి కౌంటర్లు ఇస్తే.. బీటెక్ రవికి అనవసరంగా స్టేట్ లెవెల్ ప్రొజెక్షన్ ఇచ్చినట్లు అవుతుందని వైసీపీ వ్యూహాత్మకంగా మౌనం వహించింది.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బీటెక్ రవి అంతలా విరుచుకుపడుతుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చే విషయంలో దారుణంగా ఫెయిల్ అవుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా నడుస్తోంది. ఒకప్పుడు వైఎస్ జగన్‌ను ఎవరైనా ఒక్క మాట అంటే చాలు.. కడప జిల్లాతో పాటు రాయలసీమ అంతటా ఉన్న వైసీపీ సింహాలు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులను చీల్చి చెండాడేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. కడప కోటలోనే జగన్‌పై ఇంత ఘాటుగా ఆరోపణలు వస్తున్నా.. స్థానిక కడప నాయకులు కనీసం నోరు మెదపకపోవడం వెనుక అర్థమేంటి..?

జగన్‌కు అత్యంత నమ్మకస్తులైన రాయలసీమ కీలక నేతలు సైతం ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా.. అది ఆయన సొంత డిఫెన్స్ లాగే కనిపిస్తోంది తప్ప, పార్టీ పరంగా బీటెక్ రవిని గట్టిగా తిప్పికొట్టేలా లేదు. అవినాష్ రెడ్డి మాటలు ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం.. ఆయన వెనుక మిగతా రాయలసీమ నాయకత్వం నిలబడకపోవడమే. గత ఎన్నికల ఓటమి తర్వాత రాయలసీమ వైసీపీ లీడర్లలో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోంది.

కేసులు పెడతారనో, లేక కూటమి ప్రభుత్వం తమ వ్యాపారాలను దెబ్బతీస్తుందనో భయపడి చాలామంది లీడర్లు సైలెంట్ అయిపోయారు. మరికొందరైతే జగన్ పక్కన ఉంటే పొలిటికల్ మైలేజ్ రాదనే భావనతో ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ బలహీనతనే టీడీపీ సోషల్ మీడియా క్యాష్ చేసుకుంటోంది. వైసీపీ లీడర్ల మౌనాన్ని ఆసరాగా చేసుకుని, బీటెక్ రవి కామెంట్స్‌ను ప్రతి గ్రామంలోనూ డిజిటల్ స్క్రీన్లపై పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడంలో వైసీపీ ఘోరంగా విఫలమవ్వడం.. ఆ పార్టీ క్యాడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేస్తోంది.

కానీ, ఎప్పుడైతే టీడీపీ సోషల్ మీడియా ఈ ప్రెస్ మీట్లను విపరీతంగా ప్రమోట్ చేయడం ప్రారంభించిందో.. వైసీపీ అలర్ట్ అయ్యింది. వెంటనే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి బీటెక్ రవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నువ్వెంత.. నీ బతుకెంత..? గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవి కోసం రూ. 12 కోట్లు బేరం పెట్టింది నువ్వు కాదా?" అంటూ అవినాష్ రెడ్డి రివర్స్ ఎటాక్ చేశారు. దీనికి బీటెక్ రవి మళ్లీ కౌంటర్ ఇస్తూ.. "రూ. 15 కోట్ల ఆఫర్ ఇచ్చింది మీరే.. దమ్ముంటే తోటలో ఏం జరిగిందో బయటపెట్టు, నీకు సినిమాలో పుష్ప గుర్తున్నాడేమో.. నేను నీకు పుష్ప-3 చూపిస్తా" అంటూ డైలాగ్ వార్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.

ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. జగన్ మనస్తత్వం గురించి, వైఎస్ ఫ్యామిలీ అంతర్గత విషయాల గురించి పులివెందుల ప్రాంతానికి చెందిన లీడర్ మాట్లాడితే జనాల్లోకి బలంగా వెళ్తుందని టీడీపీ భావించింది. అందుకే టీడీపీ సోషల్ మీడియా వింగ్ బీటెక్ రవి ప్రెస్ మీట్లను బాగా వైరల్ చేస్తోంది. మరోవైపు, వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి ఆరోపణలను ప్రజల్లోకి అంతే బలంగా తీసుకెళ్లడంలో కాస్త వెనుకబడ్డారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. అవినాష్ రెడ్డి మాట్లాడినా అది వివేకా కేసు డిఫెన్స్ లాగే కనిపిస్తోందని, బీటెక్ రవి అడిగిన ప్రశ్నలకు వైసీపీ సోషల్ మీడియా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూశారుగా.. పులివెందుల వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ డైలాగ్ వార్ ఏపీ రాజకీయాల్లో కొత్త కాక రేపుతోంది. జగన్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ బీటెక్ రవి చేస్తున్న విమర్శలు, దానికి అవినాష్ రెడ్డి ఇస్తున్న కౌంటర్లు ఎటు దారితీస్తాయో చూడాలి.

Published : 
  • 29 May 2026, 1:30 PM IST