Top story:అవినీతికే అమ్మ.. శాంతమ్మ… సీక్రెట్ ఫైల్స్ చూసి ఏసీబీ అధికారులే షాక్…!

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి.. సోషల్ మీడియాలో మేడంకి ఉన్న క్రేజ్ ఓ లెవెల్ లో ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేడం ఫోటోలు, న్యూస్ కు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రయారిటీ ఎక్కువ. లేటెస్ట్ గా మేడం మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసారు.

Post Published By: dialnews
Updated : 9 April 2026, 9:50 AM IST

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి.. సోషల్ మీడియాలో మేడంకి ఉన్న క్రేజ్ ఓ లెవెల్ లో ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేడం ఫోటోలు, న్యూస్ కు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రయారిటీ ఎక్కువ. లేటెస్ట్ గా మేడం మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఏకంగా దేవుడి ఆస్తులకే ఎసరు పెడితే శిక్ష ఎలా ఉంటుందో.. మేడం గారికి ఏపీ ఏసీబీ చేసి చూపించింది. అవును.. ఏడాదికిపైగా సస్పెన్షన్, ఆ తర్వాత కోర్ట్ కు వెళ్లి.. ఆర్డర్ తెచ్చుకుని విధుల్లో జాయిన్ కావడం.. విధుల్లో జాయిన్ అయిన వారంలోపే అరెస్ట్ కావడం అన్నీ ఒక సంచలనమే. అసలు ఈమె వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు..? దేవుడి సొమ్మును ఎలా గుమ్మరించారు..? ఈ వీడియోలో కంప్లీట్ పోస్ట్‌మార్టం చేద్దాం..

విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న శాంతిపై గత కొంతకాలంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మంగళవారం ఉదయం.. తాడేపల్లిలోని వైఎస్ జగన్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఒక విలాసవంతమైన భవనం ముందు ఏసీబీ వాహనాలు ఆగగానే అందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడ నివసిస్తున్నది ఎవరో కాదు.. దేవదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరు తెచ్చుకున్న కలింగిరి శాంతి. గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లితో పాటు.. విశాఖలోని ఎండాడలో ఉన్న ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు.

గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి అధికారులే విస్తుపోయారు. సోదాల్లో ఏం దొరికాయో తెలుసా..? దాదాపు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏకంగా మూడు కిలోలకు పైగా వెండి వస్తువులు. అంతేకాదు.. విశాఖపట్నంలో ఒక లగ్జరీ త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్, తాడేపల్లిలో ఒక మూడంతస్తుల భవనం, భారీగా నగదు, బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు, వోక్స్ వాగన్ కారు.. ఇలా నాలుగేళ్లలో ఒక అధికారిణి ఇంతగా ఎలా సంపాదించింది..? కేవలం 2020లో సర్వీసులోకి వచ్చిన ఒక అసిస్టెంట్ కమిషనర్‌కు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి..? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

2020 జనవరి.. నంద్యాలకు చెందిన శాంతి అసిస్టెంట్ కమిషనర్‌గా వైజాగ్ లో అడుగుపెట్టారు. అప్పుడు ఆమె దగ్గర ఉన్నది కేవలం ఒక చిన్న సూట్‌కేసు మాత్రమే. కొన్నాళ్లు సత్రంలోనే బస చేశారు. కానీ వైసీపీ నేతల ఆశీర్వాదం ఆమె మీద పడటమే ఆలస్యం.. సీన్ మొత్తం మారిపోయింది. ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే.. విశాలాక్షినగర్‌లో ఖరీదైన త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనేశారు. అక్కయ్యపాలెం అద్దె ఇల్లు పోయి.. సొంత ప్యాలెస్‌లు మొదలయ్యాయి. దేవుడి ఆస్తులే ఆదాయ వనరులుగా మార్చుకుంది ఈ మాయావి.

ఇక్కడ వింటే గగుర్పాటు కలిగే నిజం ఒకటి ఉంది. శాంతి చదువుకోవడానికి, ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఆమె భర్త మదన్ మోహన్ ఆర్థికంగా ఎంతో సాయం చేశారు. కానీ ఆమె మాత్రం ఆయన్ని కేవలం డబ్బులు వసూలు చేసే ఏజెంట్‌లా వాడుకుంది. 2022లో విజయవాడలో 4 కోట్ల విల్లా కొనడానికి.. అమెరికాలో ఉన్న భర్తను ఇండియాకు రప్పించింది. ఆయనతో కలిసి ఒక బిల్డర్ దగ్గరకు వెళ్లి కోటి రూపాయల క్యాష్ బ్యాగ్ తీసుకుంది. అంతటితో ఆగలేదు.. ఆయన్ని హైదరాబాద్ పంపించి ఒక వైసీపీ నేత ఇంటి నుంచి మరో 60 లక్షలు తెప్పించుకుంది. అంటే దేవుడి సొమ్ము, బినామీల సొమ్ము ఎలా ప్రవహించిందో అర్థం చేసుకోండి.

శాంతి కెరీర్ ఎంత వివాదాస్పదమో.. ఆమె పర్సనల్ లైఫ్ అంతకంటే సంచలనం. భర్త మదన్ మోహన్ ఉండగానే.. విశాఖలో సుభాష్ రెడ్డి అనే లాయర్‌తో పరిచయం పెంచుకుంది. అది కాస్తా పెళ్లికి దారితీసింది. విజయవాడలో విల్లా కట్టింది కూడా ఈయనతో కలిసే. వీరికి ఒక మగబిడ్డ పుట్టాక.. ఆ బిడ్డ తండ్రి సుభాష్ రెడ్డే అని మీడియా ముందే ధైర్యంగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అంటే చట్టం, నీతి, నిజాయితీ.. దేనికీ భయం లేదన్నట్టుగా ఆమె ప్రవర్తన సాగింది. అందుకే ఇప్పుడు ఏసీబీ వేట మొదలైంది.

విశాఖలో ఉన్నప్పుడు సంపత్ వినాయక ఆలయం, ఎర్నిమాంబ గుడి, కనకమహాలక్ష్మి దేవస్థానం.. ఇలా ఆదాయం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఈవోగా పాగా వేశారు. అనకాపల్లి జిల్లాల విభజన అయ్యాక కూడా అక్కడి భూముల కోసం అదనపు బాధ్యతలు వదులుకోలేదు. ఇదంతా వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి అండతోనే సాగిందని టాక్ కూడా ఉంది. అందుకే ప్రభుత్వం మారగానే ఆమె బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏసీబీ సోదాల్లో దొరికిన ఆ 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి.. ఇవన్నీ భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి సంపాదించినవే.

ఒక అధికారిణి తలుచుకుంటే వ్యవస్థను ఎలా మేసేయొచ్చో శాంతి ఉదంతం చెబుతోంది. భర్తను మోసం చేసి, దేవుడిని వంచించి, రాజకీయ అండతో కోట్లు కూడబెట్టిన ఈమె ఇంట్లో.. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన అత్యంత రహస్యమైన దేవస్థానం ఫైళ్లు.. ఆమె ఇంట్లో దొరికాయి. అసలు ఆ ఫైళ్లు అక్కడ ఎందుకు ఉన్నాయి? ఎవరికి భూములు కట్టబెట్టడానికి ఈ ఫైళ్లు రెడీ చేశారు? అనే కోణంలో విచారణ చేయగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. కేవలం ఫైళ్లే కాదు.. లెక్కలు రాసుకున్న డైరీలు, భారీగా నగదు, బంగారు ఆభరణాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. ఏ ఏ భూములు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్రైవేట్ వ్యక్తులతో డీలింగ్ కుదిరింది? ఎంత వాటా ఎవరికి వెళ్ళాలి? అనే వివరాలు ఆ డైరీల్లో ఉన్నాయని టాక్. శాంతిని దాదాపు 10 గంటల పాటు విచారించిన అధికారులు.. ఆమె సమాధానాలతో సంతృప్తి చెందలేదు. పైగా విచారణకు ఏమాత్రం సహకరించకుండా.. అన్నీ బుకాయించడంతో చివరకు ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

Published : 
  • 9 April 2026, 9:50 AM IST