Top story: ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం ఉండదా..? స్టాలిన్ చెప్పిన సంచలన నిజాలు ఏంటీ..? తమిళనాట ఏం జరుగుతోంది..?

తమిళ నాట ఊహించని రాజకీయ భూకంపం.. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన దళపతి విజయ్.. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సంచలనం సృష్టించారు. కానీ, ఇప్పుడు ఆ విజయ్ ప్రభుత్వంపై డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్ అత్యంత షాకింగ్ కామెంట్స్ చేశారు.

Post Published By: dialnews
Updated : 30 June 2026, 9:23 AM IST

తమిళ నాట ఊహించని రాజకీయ భూకంపం.. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన దళపతి విజయ్.. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సంచలనం సృష్టించారు. కానీ, ఇప్పుడు ఆ విజయ్ ప్రభుత్వంపై డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్ అత్యంత షాకింగ్ కామెంట్స్ చేశారు. "విజయ్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోదు.. కేవలం మూడు నుంచి ఆరు నెలల్లోనే కూలిపోతుంది" అంటూ స్టాలిన్ బాంబ్ పేల్చారు. దాంతో ఒక్కసారిగా చెన్నై పాలిటిక్స్ హీటెక్కాయి. అసలు స్టాలిన్ ఎందుకు అంత నమ్మకంగా చెబుతున్నారు? విజయ్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేంటి? డిఎంకె వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఏంటి?

మనకు తెలిసిందే, దళపతి జోసెఫ్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీ.. మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. గత ముడు దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే కోటలను బద్దలు కొట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 స్థానాలకు, ఏఐఏడీఎంకే 47 స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ మార్క్ 118. విజయ్ కి కేవలం 108 సీట్లే రావడంతో.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్దతుతో ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు.

చెన్నైలో జరిగిన ఒక భారీ పొలిటికల్ ఈవెంట్‌లో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, విజయ్ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. "ప్రస్తుత అధికార పార్టీకి ఒంటరిగా పరిపాలించే ప్రజా తీర్పు రాలేదు.. ఇది కేవలం ఒక 'మైనారిటీ' ప్రభుత్వం" అని ఎద్దేవా చేశారు. ప్రజలు నిజానికి డీఎంకే ప్రభుత్వం రావాలనే ఓటు వేశారని, కానీ నిన్నటి వరకు తమ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు స్వార్థంతో విడిపోయి విజయ్‌కు మద్దతు ఇవ్వడం వల్లే ఈ టీవీకే ప్రభుత్వం బతుకుతోందని స్టాలిన్ ఆరోపించారు. ఈ అద్దె మద్దతు ఎంతో కాలం సాగదని ఆయన తేల్చి చెప్పారు.

స్టాలిన్ ఒక పవర్‌ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తూ.. "ఈ విజయ్ ప్రభుత్వం అనేది ఒక ఊగిసలాడే వాహనం లాంటిది. ఏ టర్నింగ్ దగ్గర, ఏ జంక్షన్ దగ్గర ఈ వెహికల్ బ్యాలెన్స్ తప్పి సడన్‌గా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు" అని వ్యాఖ్యానించారు. అందుకే రాబోయే మూడు నెలల్లో లేదా ఆరు నెలల్లో ఎప్పుడైనా సరే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఐదేళ్ల దాకా ఆగాల్సిన అవసరం లేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, తమ పార్టీ కేడర్ అంతా ఇప్పుడే ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్లాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డీఎంకే భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

స్టాలిన్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం.. నిన్న మొన్నటి దాకా డీఎంకే కూటమిలో ఉన్న పార్టీలు ఒక్కొక్కటిగా విజయ్ వైపు షిఫ్ట్ అవ్వడమే. తాజాగా వైకోకు చెందిన ఎండీఎంకే పార్టీ కూడా డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నుంచి బయటకు వచ్చేసింది. భావజాల విబేధాల వల్లే తాము డీఎంకే కూటమిని వీడి, ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వైకో ప్రకటించారు. ఇలా తమ మిత్రపక్షాలన్నీ విజయ్ పంచనకు చేరుతుండటంతో డీఎంకే తీవ్ర అసహనానికి లోనవుతోంది. ఈ క్రమంలోనే ఆ కూటమిలో ఏ చిన్న తేడా వచ్చినా ప్రభుత్వం పడిపోవడం ఖాయం అని డీఎంకే స్కెచ్ వేస్తోంది.

సినిమా స్క్రీన్‌పై రౌడీలను ఈజీగా కొట్టేసిన దళపతికి.. ఈ రియల్ లైఫ్ పొలిటికల్ చక్రవ్యూహం చుక్కలు చూపిస్తోంది. కూటమి పార్టీల మద్దతుతో బండి లాగిస్తున్న విజయ్.. స్టాలిన్ వేస్తున్న ఈ మైండ్ గేమ్స్, వ్యూహాలను ఎలా తిప్పికొడతారో చూడాలి! మరి స్టాలిన్ అన్నట్లు విజయ్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందా? లేక దళపతి వీరందరికీ గట్టి కౌంటర్ ఇచ్చి ఐదేళ్లు సక్సెస్‌ఫుల్‌గా పాలిస్తారా? అనేది చూడాలి.

Published : 
  • 30 June 2026, 9:23 AM IST