తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తను అనుకున్నది సాధించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తో పాటు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డినీ ఆ పదవి నుంచి తొలగించడం ద్వారా.... కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర తన మాటే నడుస్తుందని, తాను మోస్ట్ పవర్ఫుల్ అని.... ఎవరు ఇలా తోకలు జాడించిన... కట్ చేస్తాననే విషయం పార్టీ క్యాడర్లోకి... జనంలోకి బలంగా పంపించగలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక లేట్ ప్రాసెస్. ఏ విషయమైనా నాంచి నాన్చి.. మురగబెట్టేస్తారు. ఒక్కోసారి నెలలు, ఏళ్లు పట్టొచ్చు అనేది బహిరంగ రహస్యం. కానీ కొండా సురేఖ చెన్నారెడ్డి విషయంలో సీఎం రేవంత్ తన పంతాన్ని త్వరగా నెగ్గించుకున్నారు. దీంతో తనకు రాష్ట్ర పార్టీపై పట్టు ఉందని, అధిష్టానం దగ్గర పలుకుబడి ఉందని నిరూపించారు.
కుల మత కార్డులతో తనను బెదిరించలేరని తేల్చి చెప్పారు. ఇది అసంతృప్తులకు కూడా ఓ హెచ్చరిక.సహజంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, ముఠాలు కావలసినన్ని ఉంటాయి. అధిష్టానమే ముఠాలను ఎగదోస్తుందనేది జగమెరిగిన సత్యం. అందుకే ఆ పార్టీలో ఎవరిని ఎవరూ లెక్క చేయరు. ముఖ్యమంత్రిపై కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి 20 23 ఎన్నికలకు ముందే బి ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరారు. యాంటీ కేసీఆర్ వేవులో కొండ సురేఖ గెలిచారు. బీసీ మహిళా క్యాటగిరిలో కొండా కి మంత్రి పదవి దక్కింది. ఎప్పటిలాగే కొండ సురేఖ రోజుకో వివాదం సృష్టించుకుంటూ వచ్చారు.
అన్నిటికి మించి ఆమె కుమార్తె సుస్మిత నోటి దురుసుతనం.... అవధులు దాటిన అతిప్రేలాపనలు అసలుకే ఎసరు తెచ్చాయి.
తమకు అత్యంత సన్నిహితుడైన ఓఎస్డి సుమంత్ ను సీఎం రేవంత్ రెడ్డి వేధిస్తున్నారని అక్కసు తో సుస్మిత ఏకంగా రేవంత్ కి మాటల తుపాకీ గురి పెట్టారు.వరంగల్ జిల్లాలో కొండా సురేఖతో ఎవరికి పడదు .కడియం శ్రీహరి ,ఆయన కుమార్తెతో కొండకి నిత్యం గిల్లికజ్జాలే . ఇంచార్జ్ మంత్రిగా పొంగులేటి తన నియోజకవర్గంలో దండుకుంటున్నాడంటూఓపెన్ గానే ఆయనపై విమర్శలు చేశారు ఆమె. మొత్తంగా అందరికీ తలనొప్పిగా మారిపోయింది సురేఖ.
భర్త కొండా మురళి ఆమె వెనక ఉండి వ్యవహారం మొత్తం నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ అధిష్టానానికి నివేదించి... కొండా సురేఖ లాంటి వాళ్ళని వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ పోతుందని, పార్టీ నడపడం కూడా కష్టమని... నేను ఉండాలా? కొండా సురేఖ ఉండాలా? తేల్చుకోమని రేవంత్ కరాకండిగా చెప్పేశారు. దీంతో హై కమాండ్ కి యాక్షన్ తీసుకోక తప్పలేదు. అదేవిధంగా నోరు జారిన సీనియర్ లీడర్ చిన్నారెడ్డికి కూడా ఐకమాండ్ తో వాతలు పెట్టించాడు రేవంత్. అయితే దీని వెనక ఉన్న వ్యూహం ఒక్కటే...... ఈ వ్యవహారం ద్వారా నాయకుడిగా తను మరింత స్ట్రాంగ్ అవ్వాలి. ఈ పరిణామం ద్వారా అది సాధించగలిగారు రేవంత్. కొండా సురేఖను, చిన్నారెడ్డిని తప్పించడం ద్వారా ఒకే నిర్ణయంతో చాలా ప్రయోజనాలు సాధించారు రేవంత్.
మరో రెండేళ్లకు పైగా అధికారం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఆయననీ సీఎం పదవి నుంచి ఇప్పటికిప్పుడు మార్చరు అనేది కూడా స్పష్టం అయిపోయింది. రేవంత్ రెడ్డి వ్యవస్థాపరంగా కాంగ్రెస్లో బలంగా ఉన్నారు కాబట్టి ఆయన సారద్యం లోనే పార్టీ 2028 ఎన్నికలకు వెళ్తుంది. కాంగ్రెస్ లో ఇప్పుడున్న సీనియర్ నాయకులు అంతా వాళ్ల జిల్లాల్లో వాళ్ళు బలమైన నాయకులే తప్ప రాష్ట్రమంతా బలమున్న నాయకులు కాదు. అది కూడా రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్. హై కమాండ్ కూడా తనతోనే ఉందని తాజా పరిణామాల ద్వారా ఒక మెసేజ్ ని ప్రజల్లోకి, పార్టీలోకి బలంగా పంపించగలిగారు రేవంత్.