Top Story: టిడిపి పుట్టి ముంచిన పుట్టా మహేష్… ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కి డ్రగ్స్ పాజిటివ్…ఇరకాటంలో చంద్రబాబు…!

ఏలూరు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో రియల్ ఎస్టేట్ గ్యాంగ్ తో కలిసి చేసుకుంటున్న పార్టీలో డ్రగ్స్ తీసుకొని దొరికిపోయారు.

Post Published By: dialnews
Updated : 16 March 2026, 9:04 AM IST

ఏలూరు టిడిపి ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో రియల్ ఎస్టేట్ గ్యాంగ్ తో కలిసి చేసుకుంటున్న పార్టీలో డ్రగ్స్ తీసుకొని దొరికిపోయారు. మహేష్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రావడంతో పోలీసుల ఎంపీని అరెస్ట్ చేశారు.ఒక లోక్సభ సభ్యుడు డ్రగ్స్ కేసులో ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరకడం దేశంలోనే లోనే ఇది మొదటిసారి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి రోజుకో తలనొప్పి ఎదురవుతుంది. ఇప్పుడు పుట్ట మహేష్ రూపంలో చంద్రబాబుకు మరో సమస్య వచ్చి పడింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన పుట్ట మహేష్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేక మొండిగా ఆ పదవిలోనే కొనసాగుతారా అనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.

మొయినాబాదులోని బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన వీఎమ్ఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం వచ్చి పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈగల్ టీం ని చూసి ఆ పార్టీలో ఉన్న నమిత్ శర్మ అనే వ్యక్తి పోలీసులపైనే పిస్టల్ తో నాలుగు రౌండ్లు ఫైర్ చేశారు. పోలీసులు ఎదురుదాడి చేసి పార్టీలో ఉన్న మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. యూరిన్ టెస్ట్ లో పైలెట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు వెంటనే తెలిసింది. కానీ పుట్ట మహేష్ తన మూత్రంలో నీళ్లు కలిపి ఇచ్చి మొదట నెగిటివ్ తెచ్చుకున్నారు.

అనుమానం వచ్చిన పోలీసులు బ్లడ్ టెస్ట్ చేయించడంతో మహేష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. మహేష్ తో పాటు మొత్తం పదిమందిని అరెస్ట్ చేసి తరలించారు. సంఘటన స్థలం నుంచి రెండు గ్రాముల కొకైన్ వైట్ పౌడర్, రివాల్వర్ సీజ్ చేశారు. నమిత శర్మ రాజస్థాన్ కి చెందిన బిజెపి మాజీ ఎమ్మెల్యే. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. పుట్టా మహేష్ కి నమిత్ శర్మ సన్నిహిత మిత్రుడు. హైదరాబాదులో ల్యాండ్ డీల్స్ కోసం పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ లోనే ఈ డ్రగ్ పార్టీ నిర్వహించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన నమిత్ శర్మను పుట్ట మహేష్ స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కి తీసుకో వెళ్లారు. డ్రగ్స్ సమాచారంతో ఈగల్ టీము రైడ్ చేసినప్పుడు రోహిత్ రెడ్డి తమ్ముడి పిస్టల్ తీసుకొని నమిత్ శర్మ నాలుగు రౌండ్లు పోలీసులపై ఫైర్ చేశాడు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ తో పాటు మొత్తం 11 మంది నీ పోలీసు లు అరెస్ట్ చేశారు. వారిలో ప్రియాంక రెడ్డి అనే మహిళ కూడా ఉంది.

పుట్ట మహేష్...... మైదుకూరు ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు. టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు.మహేష్ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ తో పాటు, రియల్ ఎస్టేట్ మరికొన్ని వ్యాపారాల్లో ఉన్నాడు. ఈయన ఎక్కువ కాలం దుబాయ్ లోనే ఉంటూ ఉంటాడు., దుబాయ్ లోనే మహేష్ కి వ్యాపారాలు ఉన్నాయి.... అక్కడే కుటుంబం ఉంటుంది.అప్పుడప్పుడు ఇండియా వచ్చి పోతుంటాడని పార్టీ వర్గాలే చెప్తుంటాయి.2024లో యనమల, పుట్ట సుధాకర్ నాయుడు ఒత్తిడితో చంద్రబాబు పుట్ట మహేష్ కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. నిజానికి పుట్ట మహేష్ అక్కడ నాన్ లోకల్. అయినప్పటికీ వైసీపీ యాంటీ వేవ్ లో ఏలూరు ఎంపీగా గెలిచాడు.

పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతుంటాడని, సీఎం చంద్రబాబు కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతుంటాడని .. సమయం దొరికితే దుబాయ్ పారిపోతాడని నియోజకవర్గంలోని టిడిపి నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. తన వ్యాపారాల్లో బిజీగా ఉండే పుట్ట మహేష్ ఇప్పుడు అనూహ్యంగా డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. భారత పార్లమెంటు చరిత్రలో ఒక డ్రగ్స్ కేసులో లోక్సభ సభ్యుడు దొరికిపోవడం ఇదే మొదటిసారి.పార్టీ నేతలు తెస్తున్న రోజుకో సమస్యతో... తల బొపికట్టిపోయిన చంద్రబాబుకి పుట్ట మహేష్ ఇప్పుడు మరో కొత్త సమస్యగా మారాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మహేష్ ని ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తారా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై మహేష్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పుట్ట మహేష్ రాజీనామా చేయాల్సిందేనని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. టిడిపి మహేష్ విషయంలో సీరియస్ గా స్పందించకపోయినా లోక్సభలో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా పుట్టా మహేష్ లోక్సభలో అడుగు పెట్టడం టిడిపికి ఇబ్బందిగానే ఉంటుంది.

డ్రగ్స్ కేస్ మాత్రమే కాదు పుట్ట మహేష్ మిత్రుడు నమిత్ శర్మ పై ఆయుధాల కేసు కూడా నమోదయింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, పోలీసులపై కాల్పులు జరపడం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. దీనిలో కూడా పుట్టా సహ నిందితుడిగా ఉన్నాడు. అసలు నమిత్ శర్మని మహేష్ హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చాడు? ఏం చేయబోతున్నాడు? వీళ్ళిద్దరూ ఎలాంటి ల్యాండ్ డీల్స్ చేయబోతున్నారు వీటన్నిటిమీద దర్యాప్తు జరగబోతోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చంద్రబాబు మరో పెద్ద సమస్యను ఫేస్ చేయబోతున్నారు. టిడిపి ఎంపీ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరకడం అనేది ఆ పార్టీకి చాలా మైనస్ పాయింట్.

 

Published : 
  • 16 March 2026, 9:04 AM IST