కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూసారు. 82 ఏళ్ళ కావూరి అనారోగ్యంతో మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఐదుసార్లు ఎంపీగా పని చేసారు కావూరి.
1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి.. 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీ ఎన్నికయ్యారు. 2014 లో ఏపీ విభజన తర్వాత కావూరి రాజకీయాలకు దూరమయ్యారు. 2013లో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా పని చేసారు కావూరి సాంబశివరావు. కావూరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.