ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు భారతీయుల పరిస్థితి తయారైంది. అక్కడ యుద్ధం జరుగుతుంటే...ఇక్కడ కష్టాలు పడుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో...జనం గ్యాస్ పంపిణీ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు ఇండక్స్ స్టవ్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. షాపుల్లోనూ దొరకడం లేదు.హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో...ఇండియన్స్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంతో అనేక దేశాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయి. కొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నాయి.
మరికొన్ని దేశాలు గ్యాస్ కోసం నానా తంటాలు పడుతున్నాయి. అందులో భారత్ కూడా ఉంది. పెట్రోల్ షిప్ రావడంతో భారతీయులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు గ్యాస్ కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వంట గ్యాస్ లభ్యతలపై గృహ వినియోగదారులకు, చిరు వ్యాపారాలకు ఆందోళన చెలరేగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్లకు పరుగులు పెడుతున్నారు. యుద్ధం ముగుస్తుందో లేదోనన్న భయంతో ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లను స్టాక్ పెట్టుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కరెంట్ స్టవ్‌ల కోసం జనం ఎగబడుతున్నారు. హోం నీడ్స్ షాపులకు క్యూకడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.
పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల దొరక్కపోవడంతో జనం రోడ్డెక్కుతున్నారు. వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ల కోసం ఆన్‌లైన్‌లో విపరీతంగా ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో స్టవ్‌లు హాట్ కేక్‌ల్లా అమ్ముడవుతున్నాయి. చాలా కామర్స్సైట్లలో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో లేకుండా పోయాయి. కొన్ని సైట్లలో అందుబాటు లేవని కనిపిస్తుంటే...మరికొన్నింటిలో అమ్ముడుపోయాయనే మేసేజ్ దర్శనం ఇస్తోంది. సాధారణంగా ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఈ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు చెబుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా విద్యుత్‌తో పనిచేసే స్టవ్‌లు, పరికరాల కోసం డిమాండ్ పెరగడంతో వాటిని అందించలేకపోతున్నాయి.
మరికొన్ని నౌకలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో జనం జాగ్రత్త పడుతున్నారు. వంట గ్యాస్‌కు బదులుగా, విద్యుత్‌తో పనిచేసే ఇండక్స్, కుక్కర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇండక్షన్ స్టవ్‌లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు కామర్స్ వెబ్‌సైట్లలోనూ ఇండక్స్ స్టవ్‌లకు డిమాండ్ పెరిగింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఒకేసారి భారీ మొత్తంలో ఇండక్షన్స్టవ్ల ఆర్డర్లు వస్తున్నట్లు చెప్పాయి. రెండు రోజుల్లోనే 30 శాతం విక్రయాలు పెరిగాయి. రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ప్రెజర్కుక్కర్లకు సాధారణం కంటే 4 రెట్లు డిమాండ్ పెరిగింది. ఎయిర్ఫ్రయ్యర్లు, మల్టీ-యూజ్ కెటిల్స్ విక్రయాలు 2 రెట్లు వరకు పెరగడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కత్తా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ ప్రత్యామ్నాయాల కోసం వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు.