విజయ్‌ క్యాబినెట్‌లో తెలుగు లేడీ…. ఈమె బ్యాగ్రౌండ్‌ తెలిస్తే ఫ్యాన్‌ అయిపోతారు…!

తమిళనాడు రాజకీయ చరిత్రలో 1967 తర్వాత ద్రావిడ దిగ్గజాలను పక్కకు నెట్టి ఒక కొత్త పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక విజయంతో కొలువుదీరిన విజయ్ కేబినెట్‌లో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం

Post Published By: dialnews
Updated : 11 May 2026, 3:15 PM IST

తమిళనాడు రాజకీయ చరిత్రలో 1967 తర్వాత ద్రావిడ దిగ్గజాలను పక్కకు నెట్టి ఒక కొత్త పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక విజయంతో కొలువుదీరిన విజయ్ కేబినెట్‌లో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, అందులో ఏకైక మహిళ ఎస్. కీర్తన. ఆమె కేవలం మంత్రి మాత్రమే కాదు, విజయ్ టీమ్‌లో అత్యంత యువ నేతల్లో ఒకరు. కీర్తనది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆమె తెలుగు మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. తెలుగులో అనర్గలంగా మాట్లాడుతుంది కూడా. సామాజిక అంశాల పట్ల అవగాహన, చురుకైన వాక్పటిమ ఆమెకు చిన్నప్పటి నుంచే సొంతం. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు కీర్తన.

ఆమె గతంలో ఏ ప్రధాన రాజకీయ పార్టీలోనూ కీలక బాధ్యతలు చేపట్టలేదు. కానీ TVKకు స్ట్రాటజిస్ట్‌గా పని చేసని ప్రశాంత్‌ కిషోర్‌ టీం ఐప్యాక్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో TDP సోషల్‌ మీడియా ఇంచార్జ్‌గా కూడా పని చేశారు. విజయ్ తన పార్టీని ప్రకటించిన తర్వాత, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాల్లో కీర్తన చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా యువతను, మహిళలను పార్టీ వైపు తిప్పడంలో ఆమె చేసిన ‘గ్రౌండ్ వర్క్’ విజయ్‌ను ఆకట్టుకుంది. పాత తరం రాజకీయ నాయకుల కంటే కొత్త రక్తం, చదువుకున్న యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విజయ్ విజన్‌కు కీర్తన సరిగ్గా సరిపోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తన శివకాశి నియోజకవర్గం నుంచి TVK తరపున బరిలోకి దిగారు.

ఈ నియోజకవర్గంలో అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె.టి. రాజేంద్ర బాలాజీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని ఆమె సంచలన విజయం సాధించారు. సుమారు 11 వేల 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, శివకాశి కోటపై TVK జెండా ఎగురవేశారు. పార్టీ నిర్మాణ సమయంలో శివకాశి ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి విజయ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు కీర్తన. ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. అత్యంత సాధారణ ఆస్తులు కలిగిన వ్యక్తిగా నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. కీర్తన మొత్తం ఆస్తుల విలువ కేవలం 22 లక్షలు మాత్రమే. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను, యువతను సమన్వయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తెలుగు మూలాలు ఉన్న మహిళగా, తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మంత్రిగా ఎదగడం కీర్తన సాధించిన గొప్ప విజయం. విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహిళా సంక్షేమం మరియు శివకాశి అభివృద్ధిలో ఆమె ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.

Published : 
  • 11 May 2026, 3:15 PM IST