బలవంతుడికి తెలివి ఉండటం పెద్ద మేటర్ కాదు.. మొండివాడికి తెలివి ఉంటే..? గుండెల్లో రైళ్ళు కాదు మిస్సైల్స్ వెళ్తాయి.. వీపు విమానం కాదు జెట్ మోత మోగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఇలాగే మోగిస్తోంది. ఇరాన్ పట్టుదలను తక్కువ అంచనా వేసి.. గాలి లెక్కలు వేసుకున్న అమెరికా, ఇజ్రాయిల్ కు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ కాదు.. దానమ్మ మొగుడు అవుతుంది. ఇప్పుడు హార్మూజ్ పై పట్టు కోసం డోనాల్డ్ ట్రంప్.. బెదిరింపుల దగ్గరి నుంచి అడుక్కునే వరకు వెళ్ళాడు.. ఫ్యూచర్ లో ఇంకా ఏ స్టేజ్ కు దిగుతాడో తెలియదు. ఇప్పుడు మనం వినే.. ఇరాన్ అనుసరించే అత్యంత ప్రమాదకరమైన 'హొర్ముజ్ జలసంధి స్వార్మ్ అటాక్' వ్యూహం ట్రంప్ కు అర్ధమైతే.. హార్ముజ్ లో అడుగుపెట్టాలంటే చెమటలు కాదు.. భయంతో గూబ గుయ్యి మంటుంది.వరల్డ్ మ్యాప్‌లో హొర్ముజ్ జలసంధి ఒక చిన్న సందులా కనిపిస్తుంది. కానీ, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఇది 'లైఫ్ లైన్'. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20% నుండి 30% ఇక్కడి నుంచే వెళ్తుంది.
ఈ ఇరుకైన సముద్ర మార్గంపై పట్టు సాధించేందుకు ఇరాన్ కనిపెట్టిన వినాశకరమైన వ్యూహమే "స్వార్మ్ టాక్టిక్స్". ఈ జలసంధి వెడల్పు కొన్ని చోట్ల కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. ఇందులో నౌకలు ప్రయాణించే మార్గం ఇంకా ఇరుగ్గా ఉంటుంది. అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు ఇక్కడ వేగంగా మలుపులు తిరగలేవు లేదా తప్పించుకోలేవు.సరిగ్గా ఇదే ఇరాన్‌కు ప్లస్ పాయింట్. ఇక్కడే ఇరాన్ ఆర్మీ ఉచ్చు వేసి.. 'స్వార్మ్ అటాక్' చేస్తుంది. ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ ద్వారా ఈ దాడిని ప్లాన్ చేసింది. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో వేగవంతమైన స్పీడ్ బోట్లు ఉన్నాయి. ఇవి గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. వీటిని రాడార్లు గుర్తించడం చాలా కష్టం. ఒక భారీ శత్రు నౌక హొర్ముజ్‌లోకి రాగానే, ఇరాన్ ఒకేసారి 50 నుండి 100 బోట్లను అన్ని వైపుల నుండి పంపిస్తుంది. బెల్లం కోసం చీమల దండు ఎలా వస్తుందో అలా అన్నట్టు.ఈ బోట్లలో భారీ మెషిన్ గన్లు, రాకెట్ లాంచర్లు, చిన్నపాటి యాంటీ-షిప్ మిస్సైల్స్ ఉంటాయి.
ఒకేసారి వందల వైపుల నుండి కాల్పులు మొదలైతే, ఎంతటి అధునాతన రక్షణ వ్యవస్థ ఉన్నా అది గందరగోళానికి గురవుతుంది. ఈ వ్యూహంలో అత్యంత భయంకరమైనది 'ఆత్మాహుతి బోట్లు'. కొన్ని బోట్లలో మనుషులు ఉండరు.. వాటి నిండా వందల కిలోల పేలుడు పదార్థాలు ఉంటాయి. ఇవి నేరుగా వెళ్లి యుద్ధ నౌకను ఢీకొడతాయి. ఒక్క బోటు తగిలినా నౌక ఇంజిన్ ఆగిపోతుంది లేదా నౌక మునిగిపోతుంది.హొర్ముజ్‌లో ఒక్క నౌక మునిగినా ఆ మార్గం బ్లాక్ అవుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గంటల వ్యవధిలో డబుల్ అయిపోతాయి. ఇరాన్ ఈ వ్యూహాన్ని కేవలం యుద్ధం కోసమే కాదు, అమెరికా వంటి దేశాలను బెదిరించడానికి ఒక 'బేరసారాల ఆయుధం' లా వాడుతుంది. అమెరికా నావికాదళం ప్రపంచంలోనే అత్యంత బలమైనది. కానీ, హొర్ముజ్ వంటి ఇరుకైన చోట 'స్వార్మ్ అటాక్' జరిగితే భారీ ప్రాణనష్టం జరుగుతుందని పెంటగాన్ స్వయంగా అంగీకరించింది. అందుకే అక్కడ ఇరాన్ స్పీడ్ బోట్లు కనిపిస్తే చాలు, అమెరికా నౌకలు హై అలర్ట్ అవుతాయి.