అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచానికే నేనే బాస్ అని ఫీలయ్యే వ్యక్తి.. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి..? ఆయన ఇస్తున్న డెడ్‌లైన్లు చూస్తుంటే.. అవి హెచ్చరికల్లా లేవు, ఇరాన్ ముందు అడుక్కుంటున్నట్టుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పదే పదే డెడ్‌లైన్లు విధించడం, అవి ముగిశాక మళ్ళీ కొత్త గడువు ఇవ్వడం.. ఇది ట్రంప్ మార్క్ 'కామెడీ'గా మారిపోయింది. నిన్న మంగళవారం అని చెప్పిన ట్రంప్.. తాజాగా తన 'ట్రూత్ సోషల్'లో బుధవారం ఉదయం అని.. గంటలకు అని మరో డేట్ ఇచ్చారు. అసలు ట్రంప్ మాటంటే ఇరాన్‌కు భయం పోయిందా..? అగ్రరాజ్యం అధ్యక్షుడు ఇన్నిసార్లు వెనక్కి తగ్గడం వెనుక ఉన్న అసలు బలహీనత ఏంటి..? ముందు గమనించాల్సిన విషయం.. ఈ డెడ్ లైన్ కొత్తది కాదు.. గతంలో చాలా సార్లు విధించాడు. యుద్ధం మొదలైనప్పటి నుండి ట్రంప్ ఇరాన్‌కు ఎన్ని డెడ్‌లైన్లు ఇచ్చారో లెక్కే లేదు. '48 గంటల్లో హోర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ ముక్కలవుతుంది' అన్నాడు.. ఏమైంది? ఇరాన్ లొంగలేదు. 'పది రోజుల్లో శాంతి చర్చలకు రాకపోతే బాంబులు వేస్తాం' అన్నాడు.. ఏమైంది..? ఇరాన్ అస్సలు తగ్గలేదు. ఏం పీక్కుంటావో పీక్కోరా అనేసింది. ఇప్పుడు మళ్ళీ మంగళవారం రాత్రి 8 గంటలకు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలు. నిలకడలేని స్వభావం గల ట్రంప్.. టెహ్రాన్‌ను శాంతింపజేయడానికి పదే పదే 'మరో రోజు సమయం' ఇస్తున్నాడు అంటేనే అర్థమవుతోంది.. ట్రంప్ దగ్గర ఇరాన్‌ను అడ్డుకునే ప్లాన్ లేదు, కేవలం సోషల్ మీడియాలో అరుపులు మాత్రమే ఉన్నాయి. ట్రంప్ తాజా పోస్ట్‌లో ఏమన్నాడో తెలుసా..? ఇరాన్ లొంగకపోతే ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తారట. సామాన్య ప్రజలు వాడే కరెంట్, రాకపోకలు సాగించే వంతెనలపై దాడి చేస్తామని ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు బెదిరించడం ఎంతవరకు సమంజసం..? అందుకే ఇరాన్ దీనిని ముమ్మాటికీ 'యుద్ధ నేరం' అని ప్రపంచం ముందు పెట్టింది.ట్రంప్ బెదిరింపులకు భయపడే కాలం పోయింది. ఇరాన్ నాయకత్వం చాలా స్పష్టంగా ఉంది.. 'నువ్వు ఒక వంతెన కూలిస్తే.. మేము నీ ఆర్థిక వ్యవస్థనే కూలుస్తాం' అని రివర్స్ కౌంటర్ ఇస్తోంది. అందుకే ట్రంప్ తన బెదిరింపులను అమలు చేయలేక, డెడ్‌లైన్ల మీద డెడ్‌లైన్లు మారుస్తూ కాలక్షేపం చేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దానికి బదులుగా, ఫిబ్రవరి 28 నుండి జరిగిన యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని, ఆ డబ్బుతోనే జలసంధిని మళ్ళీ తెరుస్తామని ఇరాన్ కొత్త మెలిక పెట్టింది. అంటే అమెరికానే తనను బ్రతిమాలేలా ఇరాన్ పావులు కదుపుతోంది.
అసలు ట్రంప్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నది ఫిబ్రవరి 28 నాటి పరిణామం. అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడులకు నిరసనగా, ఇరాన్ ప్రపంచ చమురు మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని సమర్థవంతంగా మూసివేసింది. ప్రపంచ దేశాలకు కావాల్సిన గ్యాస్, చమురు సరఫరా ఆగిపోయింది. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి ట్రంప్ కుర్చీ కదులుతోంది. ఈ జలసంధిని తెరిపించడానికి ట్రంప్ ఎన్ని డెడ్‌లైన్లు ఇచ్చినా ఇరాన్ మాత్రం 'ముందు దాడులు ఆపండి, అప్పుడు చూద్దాం' అంటోంది. ఈ యుద్ధం వల్ల కేవలం అమెరికా, ఇరాన్ మాత్రమే కాదు.. ప్రపంచమంతా నష్టపోతోంది.హోర్ముజ్ జలసంధి మూతపడటంతో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో బారెల్‌కు 126 డాలర్లు దాటాయి. ఇది 1970ల నాటి ఇంధన సంక్షోభం కంటే భయంకరంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న దేశం తన మెడ పట్టుకుని నిలదీస్తుంటే, ప్రపంచం ముందు తల ఎత్తుకోలేక ట్రంప్ ఇలాంటి 'గూఢమైన' పోస్ట్‌లతో మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నాడు. కానీ ఇరాన్ దారిలోకి రావడం లేదు సరిగ్గా కదా, అమెరికానే ఇరకాటంలో పడుతోంది. ట్రంప్ ఇప్పటివరకు ఈ డెడ్‌లైన్‌ను కనీసం మూడు సార్లు మార్చడం ఆయనను కామెడి పీస్ ను చేసింది.
ప్రతిసారి గడువు ముగిసే కొన్ని గంటల ముందు దానిని పొడిగిస్తున్నాడు. ఫైనల్ గా ఇది ఇరాన్‌ను భయపెట్టే వ్యూహం కాదని, దాడులు చేయడానికి ట్రంప్ దగ్గర.. దగ్గర సరైన ప్రణాళిక లేదనే విషయాన్ని బయటపెడుతోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. చివరగా.. మంగళవారం రాత్రి 8 గంటల గడువు ముగిసిన తర్వాత కూడా ట్రంప్ మళ్ళీ ఇంకో డేట్ ఇస్తాడా? లేక నిజంగానే దాడి చేస్తారా? ఏది ఏమైనా.. ఇరాన్ మాత్రం ఏమాత్రం బెదరడం లేదు. యుద్ధం వస్తే అమెరికా ఆస్తులే ఎక్కువ నష్టపోతాయని ఇరాన్‌కు తెలుసు. ట్రంప్ తన అహంకారంతో చేస్తున్న ఈ డెడ్‌లైన్ల రాజకీయం అమెరికా ప్రతిష్టను దిగజార్చుతోంది.