రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీతో పెట్టుకుంటే 4 వేల కోట్లు మటాషేనా..? హిందీ మూవీ రామాయణానికి కల్కీ ఎఫెక్ట్ పడినట్టుంది. కల్కీ అంటే రిలీజైన సినిమా కాదు.. రిలీజ్ కాబోయే సీక్వెల్ మూవీ... ఆ సినిమాకు హిందీ రాయాణానికి డైరెక్ట్ లింక్ లేదు.. కాని రిలీజ్ డేట్ విషయంలో ఈ రెండీంటి మధ్య భయంకరమైన ఇబ్బంది ఉంది.. వారణాసి రాకముందే రామాయణం రావాలి.. లేదంటే, వారణాసిని చూసిన జనం, 4 వేల కోట్ల రామాయనాన్ని చూడరనే కామెంట్ భయపెడుతోంది. ఇక డ్రాగన్ ఆల్రెడీ 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది.. అది కూడా ఓరకంగా హిందీ రామాయణం రిలీజ్ డేట్ ని, ఫేట్ ని మార్చేలా ఉంది.. టీజర్ వచ్చాకే హిందీ వాళ్లు పురానాల్లో పూర్ అని మళ్లీ కన్ఫామ్ అయ్యింది. ఆదిపురుష్, బ్రహ్మస్త్ర, తోపాటు ఇప్పుడొచ్చిన రామాయణం టీజర్.. ఏది చూసినా ఒకటే మాట.. దంగల్ తీసునోడుకూడా వేస్టే.. ఇంతకి... కల్కీ 2 తో రామాయణానికొచ్చిన ఇబ్బంది ఏంటి? డ్రాగన్ తర్వాతే రామాయణం రాబోతోందా? ఆ కనెక్షన్ ఏంటి?
హిందీ రామాయాణం టీజర్ వచ్చినప్పటి నుంచి ఆదిపురుష్ పోలికలు, ప్రభాస్ కల్కీ 2 తో 4వేల కోట్ల రామాయనానికి ఇబ్బందులంటూ ఒకటే రచ్చా.. ఆదిపురుష్ అంతగా ఆడకున్నా, కథా లోపాలు,మేకింగ్ పాపాలు, గ్రాఫిక్స్ సమస్యలు తప్ప రెబల్ స్టార్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు. కేవలం తన మీసకట్టు మీదే కామెంట్స్ పేలినా... రాముడిగా తన లుక్ లో ఉన్నకిక్, మాత్రం 4 వేల కోట్ల హిందీ రామాయణంలో కనిపించట్లేదు.మొదటి నుంచి అసలు బాలీవుడ్ వాళ్లకి రామాయణ, మహాభారతాల్లో మ్యాటర్ ఉన్నట్టే కనిపించదు. ఈవిషయంలో తెలుగు వాళ్లే తోపులా? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ జమానా నుంచి వినిపిస్తోంది. అంతెందుకు సంపూర్ణరామయణం, బాలరామాయణం, ఇలా పేర్లు మారినా, అదే కావ్యాన్ని ఎన్నో కోణాల్లో తెలుగులో తీశారు.. మహాభారతాన్ని మనోళ్లు మరెన్నో కోణాల్లో చెప్పారు.
కాని బాలీవుడ్ లో ఇలాంటివేమైనా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు కనిపించాయా? వాల్లు రామాయణం తీస్తే కామెడీ అయిపోతుంది.. మహాభారతం తీస్తే మటాషైపోతుంది. అంతెందుకు, అరవోళ్లు కూడా రామాయణ,మహాభారతాలు మనోళ్లు తీసిన పద్దతి చూసి కాపీ కొట్టారే కాని, ఈవిషయంలో మొదటి నుంచి టాలీవుడే తోపు.. ఆఖరికి అవే కావ్యాలను మాడ్రనైజ్ చేసినా మనోళ్లే..రామాయణాన్ని మరో కోణంలో, బాహుబలి రూపంలో తీస్తే అదో అద్భుతమైంది. కల్కీ లో కర్ణుడిని కాసేపు చూపిస్తే 1200 కోట్ల వరదొచ్చింది. కార్తికేయ 2 నుంచి త్రిబుల్ ఆర్ లో కాసేపే కనిపించే రాముడి ఎఫెక్ట్ వరకు, పురాణాల పట్టు మనోళ్లకి దొరికినచ్చు, హిందీ బ్యాచ్ కి దొరికినట్టు లేదు.. ఎంత సేపు హీరోయిన్ల ఎక్స్ పోజింగ్, బూతు జోకులు, లేదంటే తలా తోక లేని యాక్షన్ మూవీలతోనే నెట్టుకొచ్చారు.
అలాని అసలేం బాలేని సినమాలతో బాలీవుడ్ నిండిందా అంటే అలా ఏం లేదు. అమితాబ్ జామానాలో అద్భుతాలు జరిగాయి.. అప్పడప్పుడు ఈ జెనరేషన్ లో కూడా దంగల్ లాంటి క్లాసిక్స్ వస్తున్నాయి. కాని పురానాల్లో మాత్రం పూర్ బాలీవుడ్ అన్న మాట, బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచే వినిపిస్తోంది.. 4 వేల కోట్లతో నితీష్ తీవారి తీస్తున్న రామాయణం కూడా మటానే అన్న మాట వినిపించటానికి టీజరే కారణమైంది. రణ్ బీర్ కపూర్ మొహంలో ఎక్స్ ప్రెషన్ లేదు.. సింగిల్ ఫ్రేమ్ లో కూడా ఏముంది అనిపించేలా కంటెంట్ లేదు.. ఏదో పుష్పక విమానం కొత్తగా కనిపిస్తోందన్న మాట తప్ప, 4 వేల కోట్ల రామాయణంలో ఏముంది? దిక్కుమాలిన ఏఐ ఎఫెక్ట్ లాంటి రాక్షస విజువల్స్ ఈపాటికే ట్రోలింగ్ కి గురౌతున్నాయి.. బాలీవుడ్ అంటేనే, పురాణాల్లో పూర్ అని ఫిక్స్ అవ్వాల్సిందేనా? వాళ్లంతేనా ? మారరా? ఈ ప్రశ్నలకు సమాదానం చాల దశాబ్ధాలుగా లేదు.. వస్తుందో రాతో, ఇప్పట్లో తేలేలా లేదు.