10,000 కోట్ల ప్రశ్న.. సూపర్ సీత ఎవరు…?

1400 కోట్ల తో రాజమౌలి తీస్తున్న సూపర్ స్టార్ మూవీ వారణాసి. 55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ లో రిలీజ్ కి జక్కన్న టీం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అంతవరకు బానే ఉంది. కాకపోతే పదివేల కోట్ల వసూళ్లని డిసైడ్ చేసే ప్రశ్న ఒకటి ఇప్పుడు ఎదరౌంది

Post Published By: dialnews
Updated : 7 April 2026, 6:41 PM IST

1400 కోట్ల తో రాజమౌలి తీస్తున్న సూపర్ స్టార్ మూవీ వారణాసి. 55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ లో రిలీజ్ కి జక్కన్న టీం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అంతవరకు బానే ఉంది. కాకపోతే పదివేల కోట్ల వసూళ్లని డిసైడ్ చేసే ప్రశ్న ఒకటి ఇప్పుడు ఎదరౌంది. అదే వారణాసిలో సీత ఎవరని..? సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసిలో రుద్రుడిగా, శివుడిగానే కాదు, రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. 25 నిమిషాల రామ రావణ యుద్దం ఆల్రెడీ తీసేశారు. కాని ఇప్పడు సీత ప్రశ్న ఎదురైంది.. మహేశ్ రాముడైతే, తనతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే సీత ఎవరు.. అన్నీంటికంటే గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్ ప్రకారం, హనుమంతుడిగా కనిపించబోతోంది ఎవరు..? ఆదిపురుష్ ఫైనల్ ఔట్ పుట్ బాలేకే అది ఆడలేదన్నది ఎంత నిజమో... సీత పాత్రకి క్రుతి సెట్ అవలేదన్నది అంతకంటే నిజం.. కాబట్టి రామాయణంలో రాముడి పాత్రతో సమానంగా ముఖ్యమైనది సీత రోల్.. అక్కడ ఏమాత్రం అటు ఇటు తేడా జరిగినా, రిజల్ట్ రివర్స్ అవుతుందని, చాలా వరకు హిందీ రామాయణాలు తేల్చాయి.. అందుకే 4000 కోట్ల హిందీ రామాయణానికి, సాయిపల్లవి లాంటి మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకున్నారు.. సో వారణాసిలో సీతమ్మ గా నటించేదెవరు? ఇదెందుకు 10 వేల కోట్ల ప్రశ్న?

సూపర్ స్టార్ మహేశ్ బాబు రుద్రుడిగా కనిపిస్తే, తనకి తోడుగా మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. ఆల్రెడీ వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ లో శారీతో తను కనిపించింది. శారీ లుక్ లోకూడా యాక్షన్ సీక్వెన్స్ చేసింది.కాబట్టి తన పాత్రేంటో తేలింది. కాని ఇప్పడు తేలాల్సింది మరో పాత్ర.. అదే సీతమ్మ క్యారెక్టర్... ఔను ఇందులో రామాయనం ఎపిసోడ్ ఉంది.25 నిమిషాల రామ, రావణ యుద్దం షూట్ కూడా చేశారు. యుద్దం సంగ్రమంలో సీత ఉండదు.. కాని రామ, లక్ష్మణ, హనుమంతులు, రావణుడి పాత్రలు మాత్రం చూపించాలి.. ఎంతగా రామాయణ యుద్ద గట్టమైనా, తర్వాతో ముందో సీతను చూపించాలి.. అందుకోసం రాజమౌళి ఏం చేస్తున్నాడు... రాముడిగా కనిపించే మహేశ్ బాబుకి, సీతగా కూడా ప్రియాంక చోప్రానే కనిపిస్తుందా..?

కానే కాదు. అందుకోసం మరోకర్ని తీసుకుంటున్నారు. తనది సింగిల్ సీన్ లో కనిపించే పాత్రే అయినా, ఆ పాత్రకి సాలిడ్ పర్సన్ ని తీసుకోవాల్సిందే.. లేదంటే అసలుకే మోసం అవుతుంది. అసలే ఆదిపురుష్ లో సీత పాత్రకి క్రుతి సనన్ ని తీసుకుంటే, ఎవరూ ఒప్పుకోలేదు. 4 వేలకోట్ల కొత్త రామాయణం లో సీతగా సాయి పల్లవి అనగానే, అదెలా ఉన్నా, సాయిపల్లవి సీతగా అంటే అంతా ఒప్పుకునే పరిస్థితి..సో ఇదొక్కటి చాలు, సీత పాత్రలో కనిపించే హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. వారణాసి లో రామయణ ఘట్టం చిన్నదే అయినా, అందులో సీత పాత్ర కూడా రెండు మూడు నిమిషాలే కనిపించేదైనా, ఎవరితో పడితే వాళ్లతో ఆ పాత్ర చేయించటం రిస్కే.. అందుకే సరైన వ్యక్తి కోసం వేట మొదలు పెట్టింది వారనాసి టీం. ప్రజెంట్ పాట షూటింగ్ పనుల్లో ఉన్న రాజమౌళి, త్వరలో సీతను కన్ఫామ్ చేస్తాడట. ఎందుకంటేమేలో తన సీన్ షూటింగ్ ప్లాన్ చేశారు.

అంటే ఒక నెలలో సీత పాత్ర ఎవరు వేయబోతున్నారో తేలుతుంది. బాహుబలి లాంటి మూవీలో బాహుబలికి జోడీగా కనిపించిన అనుష్క పాత్ర కూడా సీతని రిఫ్లెక్ట్ చేసింది.. తను కాబట్టే ఆ పాత్ర విసయంలో జనాలనుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి ఒక రకంగా రామాయణానికి మరో వర్షన్ కాబట్టే, ఇలాంటి పోలికలు కనిపించాయి. సో రాముడే కాదు సీత పాత్ర కూడా గొప్పగా ఉంటేనే, రామాయనం జనాల్లోకి వెళుతుంది.. అది సినిమా అయినా, సీన్ అయినా అంతే.. కాబట్టే 10 వేల కోట్లు రాబట్టే సత్తా ఉన్న రామాయణం, ఫేట్ ని సీత పాత్రే డిసైడ్ చేసేఛాన్స్ఉంది. ఇంకా రామ, రావణ ఘట్టంలో హనుమంతుడి పాత్ర వేసేదెవరు? రావణుడెవరు? ఈ ప్రశ్నలు కూడా చాలా ఇంట్రస్టింగ్ అంశాలే.. ఆ పాత్ర ధారులెవరైనా, వాళ్లు ఇందులో కనిపించేది కాసేపైనా, హై ప్రయారిటీ ఉన్న రోల్స్ వేసే వాల్లని అంతకు తగ్గట్టే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌలి. అక్కడ ఏమాత్రం అటు ఇటైనా, వారణాసిలో రామాయనం 25 నిమిషాలే అయినా, రిజల్ట్ మాత్రం 365 రోజులు కనిపిస్తూనే ఉంటుంది. అంతగా రిజల్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారుతున్నాయి ఆ పాత్రలు.

Published : 
  • 7 April 2026, 6:41 PM IST