Top story:ఇరాన్ మిస్సైల్ స్టాక్, మైండ్ బ్లాక్ పదేళ్ళ వార్ కోసం రెడీ చేసిందా…? 15 వేల మిస్సైల్స్.. 45 వేల డ్రోన్లు, మాములోళ్ళు కాదురా…!

ప్రపంచం మొత్తం ఇరాన్ చాప్టర్ క్లోజ్ అనుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇరాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి అగ్రరాజ్యం అమెరికా కూడా ఆలోచనలో పడింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని అమెరికా అనౌన్స్ చేస్తే.. ఇరాన్ వాళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ గురించి ప్రపంచానికి చెప్పింది

Post Published By: dialnews
Updated : 9 April 2026, 10:55 AM IST

ప్రపంచం మొత్తం ఇరాన్ చాప్టర్ క్లోజ్ అనుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇరాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి అగ్రరాజ్యం అమెరికా కూడా ఆలోచనలో పడింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని అమెరికా అనౌన్స్ చేస్తే.. ఇరాన్ వాళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ గురించి ప్రపంచానికి చెప్పింది. మా దగ్గర ఇంకా 15 వేల మిస్సైల్స్ ఉన్నాయి.. 45 వేల డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి.. దమ్ముంటే రండి అంటూ ఇరాన్ విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అసలు ఆ 15 వేల మిస్సైల్స్ ఏంటి..? ఆ 45 వేల డ్రోన్లతో ఇరాన్ ఏం చేయబోతోంది..? మంగళవారం ఇరాన్ అధికారులు పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా పంపిన సమాచారం ప్రకారం.. ఇన్ని దాడుల తర్వాత కూడా వారి దగ్గర 15 వేల క్షిపణులు సురక్షితంగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి..? ఇరాన్ తన భూభాగం అంతటా నిర్మించిన 'మిస్సైల్ సిటీస్' లో ఇవి భద్రంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన లిస్టు చూద్దాం.

సెజ్జిల్ మిస్సైల్స్: ఇది ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన మిస్సైల్. 2,500 కిలోమీటర్ల దూరాన్ని చిటికెలో చేరుకుంటుంది. అంటే ఇరాన్ లో ఉండి ఐరోపాలోని ఏ నగరాన్నైనా టార్గెట్ చేయొచ్చు.ఖైబర్ షెకాన్: ఇజ్రాయెల్ యొక్క 'ఐరన్ డోమ్'ను కూడా ముక్కలు చేయగల సామర్థ్యం దీనికి ఉంది.షాహాబ్-3: ఇది ఇరాన్ అమ్ములపొదిలో ఉన్న ఓల్డ్ బట్ గోల్డ్ మిస్సైల్. ఇజ్రాయెల్ మొత్తాన్ని స్మశానంగా మార్చే సత్తా దీనికి ఉంది.హైపర్‌సోనిక్ ఫతా మిస్సైల్స్: ఇరాన్ దగ్గర ఉన్న 15 వేల మిస్సైల్స్‌లో అత్యంత భయంకరమైనవి 'ఫతా' హైపర్‌సోనిక్ మిస్సైల్స్. ఇవి ధ్వని కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. అమెరికా పేట్రియాట్ లేదా ఇజ్రాయెల్ యారో.. కూడా వీటిని గాలిలో అడ్డుకోలేదు. ఇవి ఒక్కసారి లాంచ్ అయితే, టార్గెట్‌ని నాశనం చేసే వరకు వీటిని ఆపడం అసాధ్యం. ఫైనల్ గా.. 15 వేల మిస్సైల్స్ అంటే సామాన్యమైన విషయం కాదు.. ఒక్కో మిస్సైల్ కి సగటున 500 కేజీల పేలుడు పదార్థం ఉన్నా.. మొత్తం 75 లక్షల కేజీల పేలుడు పదార్థం ఇరాన్ దగ్గర సిద్ధంగా ఉంది.

ఇంకో షాకింగ్ విషయం ఏంట్రా అంటే.. ఇరాన్ దగ్గర ఉన్న మిస్సైల్స్ అన్నీ ఒకే చోట ఉండవు. వారు మొబైల్ లాంచర్లను వాడుతున్నారు. ట్రక్కుల మీద ఈ మిస్సైల్స్ ని ఉంచి నిరంతరం మారుస్తూ ఉంటారు. శాటిలైట్లు కూడా వీటిని కనిపెట్టడం కష్టం. ఒక చోట నుండి మిస్సైల్ ఫైర్ చేయగానే, ఆ ట్రక్కు వెంటనే మరో చోటికి వెళ్ళిపోతుంది. అందుకే అమెరికా ఇన్ని దాడులు చేసినా 15 వేల స్టాక్ ఇంకా మిగిలే ఉంది. ఈ 15 వేల మిస్సైల్స్ కేవలం ఇరాన్ లోనే లేవు. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హుతీలకు ఇరాన్ ఇప్పటికే వేల సంఖ్యలో క్షిపణులను సరఫరా చేసింది.ఇరాన్ మీద దాడి జరిగితే, ఇరాన్ నేరుగా స్పందించాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న తన 'ప్రాక్సీ' సైన్యాలతో ఇజ్రాయెల్ మీద మిస్సైల్ వర్షం కురిపించగలదు. ఇరాన్ తన మిస్సైల్స్ కి ఎలక్ట్రానిక్ జామింగ్ టెక్నాలజీని జత చేసింది. ఇవి శత్రువుల రాడార్ల కళ్ళు కప్పి ప్రయాణించగలవు. అలాగే జీపీఎస్ సిగ్నల్స్ ని జామ్ చేసి, శత్రువుల మిస్సైల్స్ దారి తప్పేలా చేయగలవు. క్షిపణులు ఒక ఎత్తు అయితే.. ఇరాన్ దగ్గర ఉన్న 45 వేల డ్రోన్లు మరొక ఎత్తు. వీటిని 'ఆత్మహత్య డ్రోన్లు' అంటారు.

షాహెద్-136: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రపంచాన్నే వణికించిన డ్రోన్ ఇది. కేవలం కొన్ని లక్షల ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్.. కోట్లాది రూపాయల విలువైన శత్రువుల రాడార్లను, ట్యాంకులను ధ్వంసం చేస్తుంది.ఒక్కసారిగా వందల సంఖ్యలో ఈ డ్రోన్లను వదిలితే.. ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాటిని ఆపలేదు. 45 వేల డ్రోన్లు అంటే అవి విడివిడిగా రావు.. ఇరాన్ 'స్వార్మ్' టెక్నాలజీని వాడుతోంది. అంటే గుంపులుగా వాడుతోంది. 45 వేల డ్రోన్లు అంటే.. ఒక్కో దేశం మీద వెయ్యి డ్రోన్లు వదిలినా.. 45 దేశాలను చిన్నాభిన్నం చేయొచ్చు. ఒకేసారి 100 నుండి 200 డ్రోన్లను ఒకే టార్గెట్ మీదకు వదులుతారు. శత్రువుల రాడార్లు ఏ డ్రోన్‌ని పేల్చాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఒకవేళ 90 డ్రోన్లను కూల్చేసినా, మిగిలిన 10 డ్రోన్లు వెళ్ళి మెయిన్ టార్గెట్‌ని పేల్చేస్తాయి. ఇరాన్ దమ్ము అంటే ఇదే.

మరి.. ఇరాన్ దగ్గర ఉన్న ఈ స్టాక్ తో వారు ఏమేం టార్గెట్ చేయగలరో తెలుసా..? ఇజ్రాయెల్ మొత్తం పీస్ పీస్ అయిపోతుంది. టెల్ అవీవ్ నుండి హైఫా వరకు ప్రతి అంగుళాన్ని ఇరాన్ మిస్సైల్స్ చేరుకోగలవు. అమెరికా బేస్‌లను కూడా టార్గెట్ చేయవచ్చు. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నీ ఇరాన్ రాడార్లలో ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ లోని అతిపెద్ద చమురు క్షేత్రాలను ఇరాన్ ఒక్క దెబ్బతో పేల్చేయగలదు. అదే గనుక జరిగితే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లిపోతుంది.. పెట్రోల్ ధరలు ఊహించని రేంజ్ కి వెళ్తాయి.ఇప్పుడు ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణకు ఒప్పుకుంది. అందరూ ఇరాన్ భయపడింది అనుకుంటున్నారు.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రెండు వారాల సమయంలో తన 15 వేల మిస్సైల్స్ ని, 45 వేల డ్రోన్లను మళ్ళీ రీ-అరేంజ్ చేసుకోవడానికి, తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి ఇరాన్ సమయం కోరుకుంటోంది. తాజాగా వారు వాడిన క్లస్టర్ మ్యునిషన్స్ మిస్సైల్స్.. ఇరాన్ దగ్గర ఇంకా అధునాతన టెక్నాలజీ ఉందని నిరూపిస్తున్నాయి. ఇరాన్ ని తక్కువ అంచనా వేస్తే అది ఎంత ప్రమాదకరమో.. ప్రపంచానికి.. ముఖ్యంగా అమెరికాకు పిచ్చ క్లారిటీ ఉంది. 15 వేల మిస్సైల్స్, 45 వేల డ్రోన్ల లెక్క చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. మరి అమెరికా, ఇజ్రాయెల్ ఈ 'మిస్సైల్ పవర్' ని ఎలా తట్టుకుంటాయో చూడాలి.

Published : 
  • 9 April 2026, 10:55 AM IST