Dail View: మావిగన్ వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా…? జగన్ మావిగన్ వ్యూహం తెలిస్తే మీరు షాక్ అవుతారు…!

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఒక కారిడారిగా కలిపి అక్కడ మావిగన్ పేరిట రాజధాని నిర్మించ వచ్చు అంటూ వైసిపి అధినేత జగన్ చేసిన, ప్లాన్ బి ప్రతిపాదన వెనుక ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ ఉందా?జగన్ మావిగన్ అని అనగానే.... తెలుగు రాష్ట్రాలు

Post Published By: dialnews
Updated : 8 April 2026, 12:50 PM IST

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఒక కారిడారిగా కలిపి అక్కడ మావిగన్ పేరిట రాజధాని నిర్మించ వచ్చు అంటూ వైసిపి అధినేత జగన్ చేసిన, ప్లాన్ బి ప్రతిపాదన వెనుక ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ ఉందా?జగన్ మావిగన్ అని అనగానే.... తెలుగు రాష్ట్రాలు షాక్ అయిపోయాయి. ఎల్లో మీడియా అయితే జగన్ నీ ఒక ఆట ఆడుకుంది. ఎల్లో మీడియా మాత్రమే కాదు చాలామందికి జగన్ చెప్పిన మావిగన్ థియరీ విని పిచ్చ కోపం కూడా వచ్చింది. అమరావతికి చట్టబద్ధత వచ్చి... అంతా అయిపోయిన తర్వాత జగన్ ఇలాంటి వెర్రి మొర్రి ప్రతిపాదనలు పెడతాడా? జగన్ కి పిచ్చెక్కిందా...? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. కానీ జగన్ మావిగన్ వెనక ఉన్న వ్యూహం ఏమిటో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు మాత్రమే అందరికంటే ముందే అర్థం చేసుకోగలిగారు. అందుకే ఓ రేంజ్ ఫ్రస్టేషన్ తో వైసిపి అధినేత పై విరుచుకుపడ్డారు.

అందరూ అనుకున్నట్లు మావిగన్ ప్రతిపాదన ఏదో అమాయకత్వంతోను, పిచ్చితనంతోనో జగన్ చేసింది కాదు. ఆ మాట వినగానే అందరూ జగన్ నీ ఒక జోకర్లా చూసారు. రకరకాల బూతులతో ట్రోలింగ్ చేశారు. కానీ అతను అంత అమాయకుడు కాదు. వినడానికి మావిగన్ అనే పేరు ఫన్నీగా అనిపించినా ఆ ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహంలో ప్రధానంగా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అమరావతి చట్టబద్ధతను తాను ఎలాగూ అడ్డు కోలేడు. కానీ అమరావతిపై వ్యతిరేకత లేదని చెప్తూనే... పరోక్షంగా అమరావతి ఆనందాన్ని ఆవిరి చేసేసాడు జగన్. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత రాగానే తెలుగుదేశం పార్టీ భారీగా సంబరాలు ప్లాన్ చేసింది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది... ఇక రాజధానికి తిరుగులేదు అనే విషయాన్ని ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ గ్రూప్స్ కి చేరే విధంగా సంబరాలు ప్లాన్ చేసింది. ఇంటింటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు టిడిపి నేతలు. అదే సమయంలో మావిగన్ బాంబు పేల్చాడు జగన్. ఆ సూప్ లో పడ్డారు టిడిపి నేతలు... ఎల్లో మీడియా. ఒక్కసారిగా జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ మెంటల్ గాడు అన్నారు. తిట్టిపోశారు. కానీ తెలివిగా జగన్ అమరావతి సంబరాలను మావిగన్ ద్వారా అడ్డుకోగలిగాడు.

ఇక రెండోది. మావిగన్ ప్రతిపాదనలో భాగంగా విజయవాడ గుంటూరు హైవే కి అటు ఇటు రాజధాని భవనాలు ఏర్పాటు చేయవచ్చని పిలుపునిచ్చాడు జగన్.2029 లో మళ్లీ అధికారంలోకి వస్తే.... హైవే కి అటు ఇటు మంగళగిరి దగ్గర డెవలప్ చేస్తామని చెప్పకనే చెప్పాడు. అదే మావిగన్. దీంతో ఒక్కసారిగా అమరావతి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ అన్నిటికీ పెద్ద బ్రేక్ పడిపోయింది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది కనుక జనం ఎటువంటి భయం లేకుండా వచ్చి పడిపోతారని, భూములు రేట్లు విపరీతంగా పెంచవచ్చని.... రెండు కోట్ల రూపాయలు కూడా లేని ఎకరాన్ని 20 కోట్లు అమ్మవచ్చు అని భారీగా ప్లాన్లు వేశారు. కానీ జగన్ మావిగన్ స్టేట్మెంట్తో రియాల్టర్లు ఒక్కసారిగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు అనవసరంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ చేస్తే, రేపు జగన్ వచ్చి మంగళగిరి వైపు కనుక డెవలప్ చేశాడంటే మొత్తంగా మునిగిపోతామని వనికిపోయారు. మావిగన్ స్టేట్మెంట్ ద్వారా టిడిపి, కమ్మ మద్దతు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలను తెలివిగా అడ్డుకున్నాడు జగన్.

మూడో పాయింట్. అమరావతి చుట్టుపక్కల కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ భూములు కొన్నారు. హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎలా అయితే చుట్టుపక్కల కమ్మ వాళ్ళు భూములు కొని... సూపర్ రీచ్ అయ్యారో.... అదే ప్లాన్ తో అమరావతి లో భూములు కొన్నారు. అందుకే అమరావతి కాదు కమ్మరావతి అనే విమర్శలు ఎదుర్కొంటుంది రాజధాని. అధికారంలోకొస్తే , బెజవాడ గుంటూరు హైవేపై నిర్మాణాలు చేపడతానంటూ స్టేట్మెంట్ ఇచ్చి అమరావతిలో కమ్మ సామాజిక వర్గం నిండా మునిగిపోయేటట్లు ఒక లీక్ వదిలాడు జగన్. ఇప్పటికే చంద్రబాబును నమ్మి అమరావతిలో కోట్లు పెట్టుబడులు పెట్టారు కమ్మ సామాజిక వర్గం వాళ్లు. రాజధాని ఏర్పడితే అక్కడ తాము కొన్న భూములు విలువ పెరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ తాను అధికారంలోకి వస్తే మావిగన్ వైపే వెళ్తానని చెప్పడం ద్వారా అమరావతిలో భూములు కొన్న కమ్మ వాళ్ళని తెలివిగా దెబ్బతీశాడు జగన్.

జగన్ వ్యూహంలో నాలుగో పాయింట్. అమరావతిపై వేలు లక్షల కోట్లు కుమ్మరించి కట్టడం వృధా అనేది జగన్ వాదన. అందుకే అమరావతి పేపర్ పై ఏపీ రాజధాని గానే ఉంటుంది.2029 లో వచ్చేంతవరకు చంద్రబాబు ఎంత నిర్మించగలిగితే అంత నిర్మిస్తాడు. ఆ తర్వాత మాత్రం జగన్ అమరావతిలో చిన్న ఇటుక ముక్క కూడా వేయడు. బాబు కట్టిన బిల్డింగులను.... అవసరాన్ని బట్టి వాడుకుంటే వాడుకుంటాడు, లేదంటే అలా వదిలేస్తాడు.మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేషనల్ హైవే కి అటు ఇటు నిర్మాణాలు చేపడతాడు. ఆ ప్రాంతంలో భూములు విలువ పెంచుతారు.

మావిగన్ ప్రకటన వెనక జగన్ వ్యూహం ఇది. ఇది ఆ రోజే ఎల్లో మీడియా పత్రికలకు, చానల్స్ కి, చంద్రబాబు కి అర్థమైంది. ఒక్కసారిగా వాళ్లంతా నీరుగారిపోయారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు, రియాల్టర్లు కు ఊహించని షాక్ ఇది. చట్టబద్ధంగా ఏర్పడిన అమరావతిని కలపకుండానే, భవిష్యత్తులో జగన్ మంగళగిరి వైపు డెవలప్ చేస్తే అమరావతిలో భూములు కొన్న తామంతా ఏమైపోవాలి అనే భయం ఇప్పటినుంచి అందరిలోనూ ఉంది. జగన్ టార్గెట్ కూడా ఇదే. ఆ భయం పుట్టించడానికి మావిగన్ బాణాన్ని జనంలోకి వదిలాడు.

Published : 
  • 8 April 2026, 12:50 PM IST