కర్త, కర్మ, క్రియ జోగి, అడ్డంగా బుక్కయ్యాడా….?

చంద్రబాబు నివాసం పై దాడి ఘటనలో కర్త.కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పాలడుగు దుర్గాప్రసాద్ ని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Post Published By: Vencateshg
Updated : 25 September 2024, 1:26 PM IST

చంద్రబాబు నివాసం పై దాడి ఘటనలో కర్త.కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పాలడుగు దుర్గాప్రసాద్ ని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు పెడన ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే జోగి రమేష్ దగ్గరుండి తమను తీసుకొచ్చారని, ఆయనే దాడి చేయాలని ఆదేశించారని దుర్గాప్రసాద్ పోలీసులకు వివరించాడు.

ఆ రోజు విషయమేమిటో చెప్పకుండా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న తన ఇంటికి కారులో రావాలని రమేష్ ఆదేశించారని... తన సొంత వాహనంలో అక్కడికి వెళ్లానని దుర్గాప్రసాద్ విచారణలో వెల్లడించాడు. అక్కడి నుంచి నాటి సీఎం జగన్ ఇంటి దాకా వెళ్లి వద్దామని చెప్పి.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి దాడికి తీసుకెళ్లారని అంగీకరించాడు. జోగి పిలిస్తేనే వెళ్లినట్టు ఇప్పటికే మరో ఏడుగురు నిందితులు పోలీసుల ఎదుట ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన వారందరూ కూడా ఇబ్రహీంపట్నం వారే కావడం గమనార్హం.

Published : 
  • 25 September 2024, 1:26 PM IST