ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు రౌస్ సిబిఐ కోర్ట్ నేడు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసిన కోర్ట్...
ఆమెతో పాటుగా ఈ కేసులో ఉన్న మరో 23 మంది నిందితులు తప్పు చేసారని సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కు కూడా ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేజ్రివాల్, కవిత సహా పలువురు ఈ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.