రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత అలవాట్లకు స్వస్తి పలకాల్సి ఉంటుంది. మనకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ను కంట్రోల్ చేసుకోవాలి.. గుడ్ హ్యాబిస్ కూడా లిమిట్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక పర్సనల్ లైఫ్ లో ఉండే.. ఇల్లీగల్ ఎఫైర్స్.. సుప్రీం కోర్ట్ ఎంత సపోర్టివ్ గా తీర్పులు ఇచ్చినా.. ప్రజా జీవితంలో అడుగుపెట్టినప్పుడు వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో మంచి చెడు అనే విషయాలు పక్కన పెడితే.. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్న కార్యక్రమాలే.
ఇప్పుడు ఈ సహజ కార్యక్రమాలను.. ఏపీలో కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సహజంగా పుట్టే కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నారు. 2019 నుంచి అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ వంటి వారు 2024 వరకు ఇబ్బంది పడితే.. 2024 తర్వాత కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ వంటి వారికి పర్సనల్ లైఫ్ రోమాన్స్ చుక్కలు చూపించింది. ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అరవ శ్రీధర్ 2024 లో రైల్వే కోడూరు నుంచి జనసేన ద్వారా ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తర్వాత ఆయన పేరు పెద్దగా వినపడలేదు గాని.. ఓ మహిళా ఉద్యోగి రిలీజ్ చేసిన వీడియోతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయి.. ఎమ్మెల్యే గారికి సినిమా కనపడింది. ఇక అక్కడి నుంచి వైసీపీ రాజకీయ విమర్శలు వేగవంతం చేసింది. పదే పదే ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. దీనితో జనసేన పార్టీ కూడా సీరియస్ అయి.. ఆయనను సస్పెండ్ చేయకపోయినా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. విచారణ కమిటీని ఏర్పాటు చేసి.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
విచారణ పూర్తయింది.. విచారణకు ఎమ్మెల్యే హాజరు అయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆధారాలను, లావాదేవీలను ఆయన కమిటీకి ఇచ్చారు. కాని కమిటీ విచారణకు ఆరోపణలు చేసిన మహిళ మాత్రం హాజరు కాలేదు. ఇక ఆ విచారణ తర్వాత సీల్డ్ కవర్ లో రిపోర్ట్.. పార్టీ అధిష్టానానికి కమిటీ ఇచ్చింది. ఆ తర్వాతి నుంచి జనసేన నేతలు కూడా ఒకరిద్దరు.. ఎమ్మెల్యేపై విమర్శలు చేసారు. ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టారు.
ఎప్పుడైతే సీల్డ్ కవర్ లో రిపోర్ట్ వెళ్లిందో.. అక్కడి నుంచి ఎమ్మెల్యే విషయంలో తీవ్ర చర్యలు.. ఉండే అవకాశం ఉందనే కథనాలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా తిరిగాయి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేసింది. ఆయనను సస్పెండ్ చేయడానికి పవన్ సిద్దంగా ఉన్నారని చెప్తూ.. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశాన్ని ప్రస్తావించింది. సస్పెండ్ అయిన తర్వాత అరెస్ట్ కూడా చేస్తారని మీడియా హడావుడి ఓ రేంజ్ లో చేసింది.
కానీ ఇప్పటి వరకు సస్పెండ్ గాని అరెస్ట్ గాని జరగలేదు. పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా మాత్రమే ఉన్నారు. మరి ఆయనపై పవన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పే పవన్ కళ్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు.. “లేదు” అనే సమాధానమే వస్తోంది.
సదరు మహిళ చేసే ఆరోపణలలో.. అత్యాచారం అంటుంది. కాని విచారణలో ఆమె 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టే.. ఆమె విషయాన్ని బజారుకు లాగిందనే విషయాన్ని జనసేన గుర్తించింది అంటూ గుసగుసలు వినిపించాయి. ఒకవేళ ఈ వ్యవహారం కోర్ట్ కు వెళ్ళినా సరే.. అరవ శ్రీధర్ కు, ఆమెకు జరిగిన సంభాషణలు చట్ట వ్యతిరేకం కాదని, ఆరు సార్లు అబార్షన్ అంశం కోర్ట్ లో నిలబడటం కష్టం అని.. జనసేన ఓ నిర్ణయానికి వచ్చేసిందని టాక్ వినపడుతోంది.
అందుకనే ఎమ్మెల్యే విషయంలో జనసేన పెద్దలు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెప్తున్నారు. ఏ కోణం నుంచి చూసినా ఈ వ్యవహారం వ్యక్తిగతంగానే.. జనసేనకు కనపడి ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని జనసేన మిస్ అవుతోంది. అంత బహిరంగంగా వీడియోలో ఎమ్మెల్యే దొరికాడు. అది ఎంత వ్యక్తిగత విషయం అయినప్పటికీ.. ఆయన ప్రజాప్రతినిది. పార్టీ అధికారంలో ఉంది. అలాంటప్పుడు ఎమ్మెల్యేని జనసేన ఏ కోణంలో వదిలేసినా కాపాడుతుందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది.
పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీకి.. ఈ విషయంలో జనసేన క్లారిటీగా దొరికింది. కాకపోతే.. ఆ మహిళ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీ భుజానికి ఎత్తుకోలేదు. కానీ, ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి.. జనసేన చర్యలు తీసుకోకపోతే.. నేతల్లో భయం ఉండకపోవచ్చు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో.. పార్టీ పట్టు కోల్పోయే అవకాశం ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా.. జనసేన నేతలు మాత్రం అది పర్సనల్ అంటూ.. మీడియా ముందు మాట్లాడటం మాత్రం విడ్డూరమే. అది పర్సనల్ అయితే.. వైసీపీ నేతలవి కూడా పర్సనల్ కోణంలోనే జనసేన అప్పట్లో చూడాల్సింది.