డియర్ GEN Z మిత్రులారా..!

తెలుగు సినిమా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడే శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన డైలాగ్ చెబితే థియేటర్లలో ఏ రేంజ్ విజిల్స్ పడతాయో,

Post Published By: dialnews
Updated : 3 August 2026, 8:45 PM IST

తెలుగు సినిమా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడే శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెరపై ఆయన డైలాగ్ చెబితే థియేటర్లలో ఏ రేంజ్ విజిల్స్ పడతాయో, నిజ జీవితంలో పొలిటికల్ వేదికల మీద మాట్లాడితే అంతకు మించి 'మాస్ ఎలివేషన్లు', 'ఎమోషనల్ సీన్లు' ఉంటాయి! భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ చూస్తే ప్రతీ సినిమా అభిమానికి ఒక సూపర్ హిట్ పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామా చూసినట్లే అనిపించింది. ఒక వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యత... మరోవైపు తనకు అత్యంత ఇష్టమైన ప్రధాని మోదీ గారిపై ఉన్న గౌరవం... రెండింటినీ కలిపి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలో హీరో రాత్రింబవళ్లు కష్టపడి ఊరిని కాపాడుతుంటే, విలన్లు లేదా ప్రత్యర్థులు ఆయనపై లేనిపోని నిందలు వేస్తుంటారు కదా? ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ పడుతున్న కష్టాన్ని అలాగే వర్ణించారు.

“ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం కష్టపడుతున్న మోదీ గారిని పట్టుకుని కొందరు అనకూడని మాటలు అంటుంటే నాకు చాలా దుఃఖం వేస్తోంది. కష్టపడే ఒక నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా?” అని పవన్ ప్రశ్నించారు.ఆ వెంటనే “పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి” అనే డైలాగ్‌తో మోదీపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.సినిమాల్లో విలన్ లేదా విమర్శకులు ఎంత కక్ష సాధింపులకు దిగినా, హీరో మాత్రం పెద్ద మనసుతో క్షమిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ ప్రకారం మోదీగారు కూడా సరిగ్గా అలాంటి హృదయమున్న నాయకుడే!
తన్ను తిట్టిన వారిని, విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించే ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని చూశాక... “నాకు ఆయన పాదాలకు నమస్కరించాలనిపించింది” అని పవన్ మనస్ఫూర్తిగా చెప్పారు. ఆ క్షణం వేదికపై ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో, నేటి యువతకు తమ తల్లిదండ్రులు నాయకులను గౌరవించే సరియైన సంస్కారాన్ని నేర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ స్పీచ్‌లో అతిపెద్ద పిక్చర్ ఏంటంటే... “మోదీ స్థానాన్ని భర్తీ చేయగల మరొక నాయకుడు ఈ దేశంలో లేరు” అని పవన్ గట్టిగా చెప్పడం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు "తెలుగు జాతి ఎవరికీ తలవంచదు" అని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ... ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగే ఈ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక సినీ అభిమానికి ఈ స్పీచ్ ఎలా అనిపిస్తుందంటే... కేవలం రాజకీయాలు మాట్లాడటం కాకుండా, డెడికేషన్, రెస్పెక్ట్, మరియు దేశం పట్ల ప్రేమ ఉన్న ఒక 'రియల్ లైఫ్ హీరో' మరో 'రూలింగ్ హీరో'కి ఇచ్చిన గ్రాండ్ ఎలివేషన్ లాగా ఉంటుంది! కేంద్రంతో కలిసి ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఈ అడుగులు ఇప్పుడు రాష్ట్రంలో నయా జోష్ నింపాయి.

Published : 
  • 3 August 2026, 8:45 PM IST