Top story: నేను వచ్చేస్తున్నా… త్వరలో ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ… మల్లారెడ్డి గ్రీన్ సిగ్నల్…!

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి త్వరలో ఫుల్ టైం పొలిటిషన్ కాబోతున్నారు. ఆమె 2029 లో బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దేశంలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అయిపోవడం, మహిళలకు 33 శాతం

Post Published By: dialnews
Updated : 30 March 2026, 11:10 AM IST

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి త్వరలో ఫుల్ టైం పొలిటిషన్ కాబోతున్నారు. ఆమె 2029 లో బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దేశంలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అయిపోవడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కూడా అమలు కానుండడంతో ప్రీతి రెడ్డి పొలిటికల్ అరంగేట్రం చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్ సంప్రదించిన ప్రీతిరెడ్డికి ఆమె మామ మల్లారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.సోషల్ మీడియాలో, హైదరాబాద్ హై ఫై సర్కిల్లో చామకూర ప్రీతిరెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆమె మామ మల్లారెడ్డి ఎంత పాపులరో.... ప్రీతి రెడ్డి ఇప్పుడు ఆ పాపులారిటీలో ఆయన్ని మించిపోయారు.ఉన్నత విద్యతో పాటు... వ్యాపారాల్లో అనుభవం, చొరవ... వీటన్నిటితో పాటు ఆకర్షణీయమైన రూపం ప్రీతి రెడ్డికి కలిసి వచ్చే అంశాలు. ఎంబిబిఎస్ తర్వాత ఎండి చదువుతున్న రోజుల్లోనే.. మల్లారెడ్డి చిన్న కొడుకు భద్ర రెడ్డితో ప్రేమలో పడి... మల్లారెడ్డి ఇంటి కోడలుగా వచ్చారు ప్రీతి. సహజంగానే చురుకైన వ్యక్తి కావడంతో మెడికల్ కాలేజీ బాధ్యతలు త్వరగానే చేతికి వచ్చాయి. ఇద్దరూ పిల్లల తల్లి అయినప్పటికీ మెడికల్ కాలేజ్ తో పాటు మల్లరెడ్డికి చెందిన మిగిలిన విద్యాసంస్థల వ్యవహారాలు అన్నీ ప్రీతి రెడ్డి చక్కబెడుతున్నారు. బహుశా రాజకీయాల్లోకి రావాలని ముందు నుంచే ఆలోచన ఉందేమో సోషల్ ఆక్టివిటీస్ లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

మల్లారెడ్డి విద్యాసంస్థల కార్యక్రమాలతో పాటు.... సిటీలో జరిగే పెద్ద పెద్ద కల్చరల్ ఈవెంట్స్ లోను ప్రీతి రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. అయితే ఇదంతా పొలిటికల్ ఎంట్రీ కోసమే ఆమె బేస్ గా ఆమె ఉపయోగించుకుంటున్నారని బాగా తెలిసిన వాళ్ళు చెప్తారు.బిజెపి హై కమాండ్ తో కూడా ప్రీతి రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. బిజెపిలో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఆమెను హై కమాండ్ కు పరిచయం చేసినట్లుగా తెలుస్తుంది. మల్కాజ్గిరి బిజెపి ఎంపీగా ప్రస్తుతం ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే 2029లో పరిస్థితులు మారితే ఆయన అసెంబ్లీకి రావచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా ప్రీతి మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి కర్చీఫ్ వేసి పెట్టారు.మల్లారెడ్డి బీఆర్ఎస్ లో యాక్టివ్ లీడర్.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ మల్లారెడ్డి కుటుంబం , ఆ పార్టీతోనే ఉంది . మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కొన సాగుతున్నారు. మల్లారెడ్డి బి.ఆర్.ఎస్ లో ఉండగా ఆయన కోడలు బిజెపి నుంచి ఎలా పోటీ చేస్తారు.అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మల్లారెడ్డిని ప్రశ్నిస్తే.... ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది ఆమె నిర్ణయించుకుంటారు, ఆమె నిర్ణయాన్ని నేను ఎలా అడ్డుకుంటాను అని తెలివిగా సమాధానం చెప్పారు. అంతేకాదు పరోక్షంగా ప్రీతి రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా మల్లారెడ్డి చెప్తున్నారు.

అయితే ప్రీతి రెడ్డి వ్యూహం మరో రకంగా ఉంది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, బి ఆర్ ఎస్ కచ్చితంగా కలిసే పోటీ చేస్తాయి. ఒకవేళ ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేయకపోయినా... ఎన్నికల తర్వాత అయినా సరే ఆ రెండు పార్టీలు కలవక తప్పదు. అందువల్ల తాను బిజెపిలో పోటీ చేసినప్పటికీ కుటుంబం సంబంధాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఫైనల్ గా అందరూ కలిసి ఒకే సభలో కూర్చుంటామని ఆలోచనలో ఉన్నారు ప్రీతి రెడ్డి. బహుశా మల్లా రెడ్డి వ్యూహం కూడా ఇదే కావచ్చు. ఒకవేళ బిజెపి నుంచి ప్రీతి రెడ్డి కి టికెట్ రాకపోతే,నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి బి ఆర్ ఎస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని ప్రీతి రెడ్డి పట్టుదలగా ఉన్నారు. మీ కోడలు ప్రీతి రెడ్డి బిజెపి నుంచి పోటీ చేస్తారంట కదా, అని మల్లారెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని మల్లారెడ్డి ఎదురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ప్రీతి రెడ్డి భర్త , మల్లారెడ్డి రెండో కొడుకు భద్రారెడ్డి కూడా బరిలో దిగుతారని టాక్. ఇదే విషయం కూడా మల్లారెడ్డిని అడిగితే.... ఎం ఐ ఎం వాళ్ళు ఎలాగైతే ఏడుగురు ఎమ్మెల్యేలతో తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారో, మా ఫ్యామిలీ కూడా వీలైనంత ఎక్కువ సీట్లలో పోటీ చేసి మా మార్క్ చూపిస్తాం అని చెప్తున్నారు. మల్లారెడ్డి కుమార్తె కూడా, కోడలికి పోటీగా రాజకీయాల్లోకి రావడానికి రంగు సిద్ధం చేసుకుంటున్నారట.ప్రీతి రెడ్డి మాత్రం రాజకీయాల్లోకి రావడం పక్కా. హిందుత్వ అజెండాపై తనకు కొంత అవగాహన ఉందని చెప్తున్న ప్రీతి వీలున్నప్పుడల్లా బిజెపి అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రీతి రెడ్డి వ్యూహం పక్కా అమలు అయితే, 2029 లో ఆమెని ఎంపీగా చూడటం ఖాయం. ఈమధ్య మల్లారెడ్డి 50వ వివాహ వేడుకను ప్రీతి రెడ్డి తాను చేయబోయే ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం పద్ధతిగా వినియోగించుకున్నారు. అంతేకాదు ప్రీతి రెడ్డి ప్రతి ఆక్టివిటీ సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. నియోజకవర్గంలో ఆమె ఎక్కడికి వెళ్లినా, గుర్తు పట్టని వాళ్ళు అంటూ ఉండరు. ప్రీతి రెడ్డికి కావలసింది కూడా అదే. అయితే ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాకుండానేఇలా పబ్లిసిటీ స్టంట్ చేయడం మంచిది కాదని, ఓవర్ జోష్ఒక్కసారి దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని, ప్రీతి రెడ్డి సన్నిహితులు హెచ్చరిస్తున్నారు.

 

Published : 
  • 30 March 2026, 11:10 AM IST