Renuka Chowdhury: ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలపై పువ్వాడ దాడులు: రేణుకా చౌదరి

పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగంపైనా బైండోవర్ కేసులు వేశారు. ఎంఐఎం, బీఆరెస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 14 November 2023, 3:37 PM IST

Renuka Chowdhury: ఖమ్మంలో ఓటమి భయంతోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (puvvada ajay kumar) కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury). మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు.

REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి

"రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామీ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని కడిగేస్తుంది. పువ్వాడ అజయ్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగంపైనా బైండోవర్ కేసులు వేశారు. ఎంఐఎం, బీఆరెస్ కలిసి ఇబ్బందులు పెడుతున్నాయి. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్. మీ ఇంటికి వచ్చి సవాలు చేస్తాం. నువ్వు ఓడిపోయిన తక్షణం అక్కడి నుంచి పారిపోతావ్. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నాడు. పువ్వాడ అజయ్ పాముకు పాలు పోస్తే కాటు వేసే రకం. పువ్వాడ అజయ్.. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ముందుకు వస్తారు.

బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒకటే. మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాడులు చేస్తున్నాయి. మీరు దాడులు చేస్తారని మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా. బీఆరెస్‌లో ఎంతమంది కోవర్ట్‌లు ఉన్నారో మాకు తెలుసు. మాకు కోవర్ట్‌లు ఉన్నారు. వారికి కూడా కోవర్ట్‌లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తాం.

Published : 
  • 14 November 2023, 3:37 PM IST