500 ఎకరాలు కొనేసిన సాయి రెడ్డి.. తమిళనాడు మాజీ ఎమ్మెల్యేతో కలిసి వ్యవసాయం

వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏమో గాని ఆయన గురించి న్యూస్ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాని కూడా గట్టిగానే షేక్ చేస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 4:55 PM IST

వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏమో గాని ఆయన గురించి న్యూస్ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాని కూడా గట్టిగానే షేక్ చేస్తోంది. ఆయన గురించి ఏ న్యూస్ వచ్చిన సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చదవడం మొదలుపెట్టారు. రాజకీయాల్లో దాదాపు 10 ఏళ్ళ నుంచి విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఆయన జగన్ తర్వాత నెంబర్ 2 గా కొనసాగుతున్నారు. ఆయన చాణక్యానికి జగన్ కూడా ఫిదా అయిపోయి కీలక ప్రాధాన్యత ఇచ్చేసారు.

అయితే ఆ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత తగ్గింది అనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నందుకు సిద్ధం కావడం రాజ్యసభకు కూడా రాజీనామా చేయడం హైలైట్ అయింది. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత తాను వ్యవసాయం చేస్తానంటూ విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేశారు. ఇక లేటెస్ట్ గా వ్యవసాయం కూడా మొదలుపెట్టినట్లు ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టారు.

ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదని తమిళనాడులోని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తమిళనాడులో ఒక మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఆయన 500 ఎకరాల పొలం కొని వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. 500 ఎకరాలను తక్కువ రేటుకు కొన్న విజయసాయిరెడ్డి అక్కడే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ వంటి పంటలను సాగు చేస్తున్నారట. కొండ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ కూడా సాగు చేయడానికి విజయసాయిరెడ్డి ప్లాన్ చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

వ్యవసాయం చేస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎక్కడ చేస్తాను.. ఏం చేస్తాం అనేది మాత్రం ప్రకటించలేదు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫోటోలతో మీడియాను షేక్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే రాజకీయాలనుంచి తప్పుకోగా ఆయనకు కూడా వ్యవసాయం ఆసక్తి ఉండడంతో ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తున్నారట. ఇప్పటికే వ్యవసాయం పనులను మొదలుపెట్టి రెండు నెలలు అయిందని మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆయన విశాఖలో ఎక్కువగా ఉండటంతో అక్కడే వ్యవసాయం చేసే అవకాశం ఉందని భావించారు. మరి కొంత మంది విజయసాయిరెడ్డి లేటెస్ట్ గగా పోస్ట్ చేసిన ఫోటోలు ఒడిస్సాలో ఫోటోలని మరి కొంతమంది కర్ణాటకలో ఫోటోలని కామెంట్ చేశారు. కానీ ఆయన నెల్లూరు, తమిళనాడు బోర్డర్ లో భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి రెండుసార్లు విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎన్నిక అయిన ఆయన ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆస్థానం ఎన్డియే కైవసం కానుంది.

Published : 
  • 29 January 2025, 4:55 PM IST