Top Story: బండి సంజయ్ కి ఇజ్జత్ కా సవాల్… కరీంనగర్ మేయర్ సీటు దక్కేది ఎవరికి ? తెర వెనక ఏదో జరుగుతోందా?

కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ సాగుతున్నాయి... అధికారానికి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే...

Post Published By: dialnews
Updated : 15 February 2026, 9:10 AM IST

కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీరియస్ పాలిటిక్స్ సాగుతున్నాయి... అధికారానికి సమీపంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంటే... కమలానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లు కొత్త ఎత్తులు వేస్తున్నాయి కరీంనగర్ బల్దియాను దక్కించుకునేందుకు బీజేపీ చేస్తున్న కసరత్తులు వ్యూహాలు కేంద్రమంత్రి బండి సంజయ్ కి ఇజ్జత్కా సవాల్ గా మారాయి.కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో రాజకీయాలు రంజుగా మారాయి... బల్దియాను దక్కించుకునేందుకు సరిపడా బలం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో దక్కకపోవడంతో కరీంనగర్ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటే ఆయన అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

మొత్తం 66 డివిజన్లకు గాను 30 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ... కాంగ్రెస్‌ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాలు దక్కించుకున్నాయి... ఇక మిగిలిన పది స్థానాలను రెబెల్స్ ఇండిపెండెట్లు కైవసం చేసుకున్నారు... మప్పయి స్థానాలు సాధించినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కి 4 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది... అడుగు దూరంలో వచ్చి ఆగిపోయిన మేయర్ కుర్చీని కమలం ఖాతాలో వేయాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. ఇండిపెండెంట్లు, రెబెల్స్ పై దృష్టిపెట్టి నలుగురిని తమవైపు తిప్పుకున్నారు కమలనాథులు... దీంతో కరీంనగర్ కార్పోరేషన్ ఎక్స్‌ అఫిషియో ఓట్ల అవసరం లేకుండానే బీజేపీ వశం అవుతోందని అంతా భావించారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతోంది... బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేయడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

కరీంనగర్ మేయర్ దక్కించుకున్నామని మీడియా ముందు ప్రకటించేసిన బండి సంజయ్ కొద్ది గంటలు గడవక ముందే కరీంనగర్ పీఠాన్ని కమలానికి కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని... బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేసారు.. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగినట్టయింది.కాంగ్రెస్ బీఆర్ఎస్‌లు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాయనే టాక్ మొదలైంది... రెండు పార్టీలు కలిసినా మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ మేయర్ స్థానం దక్కించుకోవడం సాధ్యం కాదు.. ఇటువంటి టైంలో బండి సంజయ్ అలా మాట్లాడటం వెనక కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

గెలిచిన ఇండిపెండెంట్‌ను ఒకరిని ముందుకు తెచ్చి అతనికి మేయర్ సీట్ ఆఫర్ చారు హస్తం నేతలు.. అతన్ని మేయర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట.. ఆ ఇండిపెండెంట్ తన సహచరులతో పాటు బీజేపీ కార్పోరేటర్లకు కూడా పోన్లు చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.నిజామాబాద్‌లో బీఆర్ఎస్ సభ్యున్ని కాంగ్రెస్ లో చేర్చుకుని బీజేపీకి మేయర్ స్థానాన్ని దక్కకుండా చేసిన సీన్‌ కరీంనగర్‌లో రిపీట్ అవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.. అందరూ కలుస్తారా...? అర్ధికంగా పెద్దమొత్తంలో అవసరమయ్యే ఈ ఇండిపెండెంట్ వ్యూహానికి నిధులు ఎవరు సమకూర్చుతారు..? ఆచరణలో ఇది సాద్యమేనా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి... గంటగంటకు మారుతున్న పొలిటికల్ సమీకరణాలు ఏ స్టెప్ తీసుకుంటాయో చూడాలి.

 

 

Published : 
  • 15 February 2026, 9:10 AM IST