Top Story: దీనేవ్వ.. ఇరాన్ ను అమెరికా టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఇదా…?

మిడిల్ ఈస్ట్ లో డామినేషన్ కోసం ఏళ్ళ తరబడి వర్కౌట్ చేస్తూ వచ్చిన అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్ విషయంలో ముందు నుంచి చికాకు కంటిన్యూ అవుతూనే ఉంది.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 9:37 AM IST

మిడిల్ ఈస్ట్ లో డామినేషన్ కోసం ఏళ్ళ తరబడి వర్కౌట్ చేస్తూ వచ్చిన అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్ విషయంలో ముందు నుంచి చికాకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాక్, సిరియా, ఇతర గల్ఫ్ దేశాలు అన్నీ అమెరికా జెండాను తమ దేశంలో ఎగురవేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మాట వాస్తవం. కానీ ఆయుతుల్లా అలీ ఖమేని నేతృత్వంలోని ఇరాన్ మాత్రం.. తొడగొట్టి నిలబడింది. ఇస్లామిక్ రిపబ్లిక్ గా.. తమ దేశ గౌరవాన్ని అమెరికా పాదాల ముందు తాకట్టు పెట్టడానికి అంగీకరించలేదు.

ఇరాన్ చుట్టూ.. ఇజ్రాయిల్, అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చినా.. ఇరాన్ మాత్రం తల వంచలేదు. మరి అమెరికా – ఇజ్రాయిల్.. అసలు అమెరికాను ఎందుకు టార్గెట్ చేసాయి..? చాలా మందికి.. ఈ విషయంలో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. మరి నిజం ఏంటీ..? దీనిపై అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్ సంచలన కామెంట్స్ ప్రకారం.. ఇజ్రాయిల్ – అమెరికా విషయంలో ఇరాన్ ముందు నుంచి అగ్రెసివ్ గానే ఉంది. అణు ఆయుధాల విషయంలో ఇరాన్ తన ప్రయత్నాలు తాను చేసింది.

అలాగే 460 కిలోల అణు బాంబులను నిర్మించడానికి సరిపోయే మౌలిక సదుపాయాలను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ప్రోటోకాల్ ను ఇరాన్ పాటించలేదు అనే అసహనం అమెరికాకు ఉందట. గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల ద్వారా మూడు పరిష్కారాలను అమెరికా కోరినట్లు విట్కాఫ్ ప్రకటించారు. ఇరాన్ నిర్వహించే అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం, హిజ్బుల్లా వంటి ప్రత్యామ్నాయం సైనిక శక్తులను కంట్రోల్ చేయడం అమెరికా లక్ష్యంగా ఆయన బయటపెట్టారు.

చర్చల్లో భాగంగా..ఇరాన్.. ఆయుధాల సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా చెప్పినట్లు స్టీవ్ కాఫ్ వెల్లడించారు. 460 కిలోల యురేనియం బాంబులను 60 శాతం పూర్తి చేసామని, అలాగే 11 అణు బాంబులను తయారు చేసినట్లు ఇరాన్ చెప్పిందని స్టీవ్ కాఫ్ తన ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయంలో ఇరాన్ ను అడ్డుకోవడంలో తమకు తిరుగులేని హక్కు ఉందని.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించినట్లు విట్ కాఫ్ పేర్కొన్నారు. ఇరాన్‌ తో ఒప్పందంపై చర్చలు జరపడం అసాధ్యం కాకపోయినా కష్టమని అమెరికా ఉపాధ్యక్షుడు జారెద్ కుష్ణర్ వెల్లడించారని స్టీవ్ కాఫ్ తెలిపారు.

అయితే 400 కిలోల అణు బాంబులను ఇరాన్ ఎక్కడ దాచిందో ప్రపంచానికి తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ యురేనియంను రహస్యంగా తరలించిందని, వాటిలో కొంత భాగాన్ని ఫోర్డోలో.. భూగర్భ కేంద్రంలో నిల్వ చేసినట్లు అమెరికా అభిప్రాయపడింది. వాటిని యుద్ధం విషయంలో అమెరికాతో బేరసారాలకు ఇరాన్ వాడుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అణు బాంబులను ఉపయోగించాలంటే యురేనియంను 90 శాతం సుసంపన్నం చేయాలని నిపుణులు అంటున్నారు. ఇరాన్ చెప్తున్న లెక్కల ప్రకారం.. అమెరికా తన వద్ద ఉందని చెబుతున్న నిల్వలను మరింతగా పెంచుకోవడానికి ఇరాన్‌కు వారం నుండి 10 రోజులు పడుతుంది. రెండు దేశాలు ఇరాన్ పై దాడి చేస్తున్నా.. 8 దేశాలపై ఇరాన్ ధైర్యంగా దాడి చేయడానికి వెనుక కారణం భారీ అణు నిల్వలే అంటోంది అమెరికా.

Published : 
  • 4 March 2026, 9:37 AM IST