Top story : ట్రంప్ నోట ఇరాన్ పై ప్రశంసలు… వాళ్ళతో వార్ అంత ఈజీ కాదు ఇరాన్ వాళ్ళు మొండివాళ్ళు యోధులని కామెంట్స్… 158 నౌకలు మునిగినా నరకం చూపారన్న ట్రంప్…!

చరిత్రలో ఎప్పుడైనా శత్రువుని శత్రువు పొగడటం చూశారా..? అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి మొండి ఘటం, తన ప్రత్యర్థిని "చాలా తెలివైన వాడు, కఠినమైన వాడు" అని అంటున్నాడు అంటే.. సీన్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.

Post Published By: dialnews
Updated : 18 April 2026, 1:15 PM IST

చరిత్రలో ఎప్పుడైనా శత్రువుని శత్రువు పొగడటం చూశారా..? అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి మొండి ఘటం, తన ప్రత్యర్థిని "చాలా తెలివైన వాడు, కఠినమైన వాడు" అని అంటున్నాడు అంటే.. సీన్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు "ఇరాన్ ని మ్యాప్ లో లేకుండా చేస్తా" అన్న అదే ట్రంప్.. ఇప్పుడు "వీళ్ళు యోధులు, వీళ్ళు చాలా స్మార్ట్" అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. 158 నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని లెక్కలు చెబుతూనే.. ఇరాన్ పవర్‌ని చూసి ట్రంప్ షాక్ అవుతున్నాడు. అసలు అమెరికాకి ఇరాన్ ఎలాంటి నరకం చూపించింది..? 158 నౌకల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి..? ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

వారు యోధులు.. నేను ఇది జరగకముందే చెప్పకూడదు కానీ, వారికి ఇప్పుడు నౌకాదళం లేదు. 158 నౌకలు సముద్ర గర్భంలో ఉన్నాయి" అని బాంబు పేల్చాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి.సైనిక నష్టం: ఇరాన్ తన నౌకలను కోల్పోయి ఉండొచ్చు. కానీ ఉన్న అన్ని వనరులతో పోరాడారు.కానీ యుద్ధం గెలిచింది ఇరానే: ఎందుకంటే 158 నౌకలు పోయినా, ఇరాన్ బెదరలేదు.. లొంగలేదు. ట్రంప్ ఆంక్షలకు తలవంచలేదు.ఒక దేశం తన సర్వస్వాన్ని కోల్పోయినా సరే, శత్రువు ముఖం మీద నిలబడి "మేము తగ్గేదేలే" అని చెప్పగలిగితే.. వాడు కదా అసలైన యోధుడు. అందుకే ట్రంప్ వారిని 'Tough' అని ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది గురూ.. ఇరాన్ దగ్గర అమెరికా లాంటి భారీ యుద్ధ నౌకలు లేవు. కానీ వారి దగ్గర వేల సంఖ్యలో 'స్వీయ విధ్వంసక నౌకలు' ఉన్నాయి. ఇవి చిన్నగా ఉంటాయి, రాడార్ కి దొరకవు. ట్రంప్ చెబుతున్న ఆ 158 నౌకలు అమెరికా భారీ నౌకలను ఢీకొట్టి, తమను తాము పేల్చుకున్నవి కావచ్చు. అంటే ఒక్కో చిన్న ఇరాన్ నౌక.. అమెరికా కోట్లాది డాలర్ల విలువైన ఆస్తులను బూడిద చేసింది. అందుకే ట్రంప్ కి ఇప్పుడు అర్థమైంది.. వీళ్ళతో పెట్టుకుంటే నష్టం మనకే అని.

ట్రంప్ "158 నౌకలు సముద్ర గర్భంలో ఉన్నాయి" అని లెక్కలు చెబుతున్నారంటే, దాని అర్థం ఇరాన్ తన పాత నౌకలను అమెరికా క్షిపణులకు ఎరగా వేసిందని అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ తన అసలైన యుద్ధ నౌకలను దాచిపెట్టి, పనికిరాని పాత నౌకలతో అమెరికాను తప్పుదారి పట్టించి ఉండవచ్చు. అమెరికా కోట్లాది డాలర్ల క్షిపణులను ఈ పాత ఇనుము మీద ఖర్చు చేసేలా చేసి, ఇప్పుడు ట్రంప్ చేతే "యోధులు" అనిపించుకుంది. "158 నౌకలు పోయినా.. వాళ్ళు ఇంకా తెలివిగా మనల్ని దెబ్బకొడుతున్నారు" అనే ఆవేదన ట్రంప్ మాటల్లో కనిపిస్తోంది.ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాఘ్చీని 'మైండ్ గేమ్ కింగ్' అని ప్రపంచం అంటుంది. ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ని "Smart" అని ఎందుకు అన్నాడో తెలుసా? అరాఘ్చీ ఆడిన దౌత్యం అలాంటిది.

* జపాన్ ని అమెరికా నుంచి విడదీయడం..
* నాటో దేశాల్లో గందరగోళం సృష్టించడం..
* హోర్ముజ్ జలసంధిలో 'షాడో ఫ్లీట్' తో ఆయిల్ తరలించడం..

ఇవన్నీ చూశాక ట్రంప్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. "వీళ్ళు ఆయుధాల కంటే మెదడుని ఎక్కువగా వాడుతున్నారు" అని ట్రంప్ తన మిత్రదేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇరాన్ ని తక్కువ అంచనా వేయకండి.. వాడు చాలా తెలివైన వాడు అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు అంటే, అది ఇరాన్ దౌత్య విజయం కాక మరేంటి..? ఈ రోజు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే.. అగ్రరాజ్యం తన మీద పీకలదాకా ఆంక్షలు వేసినా, సముద్రంలో తన నౌకలను ముంచేసినా.. చమురు ధరలను శాసించేది మాత్రం ఇరానే.

ట్రంప్ ఆ 158 నౌకల లెక్క చెప్పి ఇరాన్ బలహీనపడింది అని ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నాడు. కానీ వాస్తవానికి, అదే 158 నౌకల త్యాగంతో ఇరాన్ ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లో ఉంచుకుంది. ట్రంప్ ఇప్పుడు "డిప్లొమాటిక్" గా మాట్లాడుతున్నాడు అంటే.. ఆయనకు ఇరాన్ పవర్ ఏంటో బానే రుచి చూపిందని అర్థం. రాబోయే రోజుల్లో ట్రంప్ ఇరాన్ తో ఒప్పందం కోసం ప్రాధేయపడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో గురూ.. మ్యాటర్ క్లియర్. ట్రంప్ నోటి నుంచి వచ్చిన "Tough and Smart" అనే మాటలు.. ఇరాన్ సాధించిన నైతిక విజయం. 158 నౌకలు పోయినా.. ఇరాన్ గుండె ధైర్యం మాత్రం సముద్రమంత లోతుగా ఉంది. అగ్రరాజ్యాన్ని గడగడలాడించిన ఈ 'యోధుల' కథ ఇక్కడితో ఆగేలా లేదు.

Published : 
  • 18 April 2026, 1:15 PM IST