Top Story: రావణ్ ఎవరి వాడు? ఏపీలో రావణ్ చుట్టూ రాజకీయం.!

యూట్యూబ్ రావణ్ ఎవరి వాడు? వైసిపి వాడా?? టిడిపి వాడా? ఏపీ రాజకీయాలు ఇప్పుడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టే తిరుగుతున్నాయి..ప్రశ్న రావణ్ మీవాడంటే మీవాడని, అతనికి మీరంటే మీరు ఫండింగ్ చేశారని ఏపీలో మూడు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి.

Post Published By: dialnews
Updated : 14 July 2026, 11:01 AM IST

యూట్యూబ్ రావణ్ ఎవరి వాడు? వైసిపి వాడా?? టిడిపి వాడా? ఏపీ రాజకీయాలు ఇప్పుడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టే తిరుగుతున్నాయి..ప్రశ్న రావణ్ మీవాడంటే మీవాడని, అతనికి మీరంటే మీరు ఫండింగ్ చేశారని ఏపీలో మూడు పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి.అతనికి వైసీపీ ఫండింగ్‌ చేసిందని జనసేన,టీడీపీ . టీడీపీయే జనసేనకు వ్యతిరేకంగా రావణునినీ పురి గొలుపుతోందని , అతనికి టిడిపియే ఫండింగ్‌ చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.రావణ్ పై ఉపా చట్టం ప్రయోగించడంపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ప్రకాష్ రాజ్‌కు, రావణ్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు బయటపడ్డాయని మంత్రి కందుల దుర్గేష్‌ స్వయంగా ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి... లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు. రావణ్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేశాడని, చంద్రబాబు నీ ఎన్నడు విమర్శించలేదని, అంతేకాక బాలకృష్ణని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడని... దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా టిడిపి తయారు చేసిన ఆయుధమే రావణ్ అని కొడాలి నాని ఇలాంటి వాళ్ళు అంటున్నారు.యూట్యూబ్ రావణ్ పవన్ కళ్యాణ్ ని దుమ్మెత్తి పోస్తున్నప్పుడు, టిడిపి నేతలు గాని, బిజెపి లీడర్లు గాని ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు. ఆ వ్యవహారం పవన్ కళ్యాణ్ కి సంబంధించిందని తామెందుకు జోక్ చెక్ చేసుకోవాలన్నట్లు వాళ్లు దూరంగా ఉన్నారు. రావణ్ విషయంపై టిడిపి స్పందించడం లేదు అనే విమర్శ రావడంతో వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సర్దుకున్నారు. రావణ్ కి ఫండింగ్ చేసింది వైసీపీ అని... ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

చిత్రమైన విషయం ఏంటంటే... ఒకప్పుడు టిడిపి మద్దతుదారుడు, మాజీ డిజిపి ఏపీ వెంకటేశ్వరరావు రావణ్ కి పూర్తిగా అండగా నిలబడ్డారు. అసలు రావణ్ పై ఉపా చట్టం కింద కేసు ఎలా పెడతారు అంటూ నిలదీస్తున్నారు ఏమి వెంకటేశ్వరరావు.రావణుకు బెయిల్ ఇప్పించే విషయంలో చివరి నిమిషంలో వైసిపి రంగాల్లోకి దిగింది.. ఆ పార్టీ నేత పొన్నవోలు రావణ్ బెయిల్ కేసిన వాదిస్తున్నారు.. జడ స్రావన్ నుంచి కేసుని ఉన్నవోలుకు బదిలీ చేసుకుంటూ ఎన్ఓసి కూడా తీసుకున్నారు. మొత్తం మీద రావణ్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.

Published : 
  • 14 July 2026, 11:01 AM IST