వైసిపి అధినేత జగన్... పెళ్లి కెళ్ళిన.... పరామర్శకు వెళ్లిన.... చావు ఓదార్పుకి వెళ్ళిన... వేలల్లో జనం వచ్చి పడిపోతుంటారు. అసలు ఎక్కడికి వెళ్లినా
ఎక్కడ లేని జనం అంతా వచ్చి జగన్ వాహనానికి అడ్డం పడిపోతూ ఉంటారు. ఇదంతా నిజంగా అభిమానమేనా? అభిమానమైతే వైసీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలు జనాన్ని చాలా వేధిస్తుంటాయి. దీని వెనక ఒక బలమైన వ్యూహం ఉంది. మొత్తం చూస్తే మీరే షాక్ అవుతారు.తాడేపల్లి నుంచి గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడానికి దూరం 30 కిలోమీటర్లు. నిదానంగా వెళ్లిన గంటలోపే అంబటి ఇంటిని చేరుకోవచ్చు. కానీ జగన్ కాన్వాయ్ కి ఆరు గంటలు పైగా సమయం పట్టింది. జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించడానికి ఆరేడు గంటలు టైం తీసుకుంది. అడుగడుగునా జనం నీరాజనం పడుతూ ఉంటారు. వాహనానికి అడ్డం పడిపోతూ ఉంటారు. అత్యంత కష్టంగా కాన్వాయ్ కదులుతూ ఉంటుంది. ఈ డ్రామా కొత్త ఏమి కాదు. సిబిఐ కోర్టుకి వెళ్లడానికి హైదరాబాద్ వచ్చిన .... జగన్ వెంట జనం ఇలాగే ఉంటారు. ఎవరైనా బాధితున్ని పరామర్శించడానికి జగన్ వెళ్లిన .... అక్కడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. జగన్ ఎక్కడికైనా వెళ్లని, వేల మంది జనం వచ్చి పడిపోతూ ఉంటారు.
టిడిపి జనసేన పార్టీలకు కూడా ఈ మాయ ఏంటో అర్థం కాదు. ఇక జగన్ వ్యతిరేక మీడియా అయితే ఆయన్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది. జగన్ వల్ల వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయని. వందల వేల వాహనాలు నిలిచిపోయాయని.... జగన్ కోసం వెయిట్ చేస్తూ జనం ఆకలితో అలమటించిపోయారని, కొందరు స్పృహ తప్పి పడిపోయారని, కూడా ఆ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది.నిజానికి ఇదంతా జగన్ వ్యూహంలో ఒక భాగం.తను ఎక్కడుంటే అక్కడ వేలల్లో జనం ఉండాలి.అన్నది వైసిపి అధినేత ప్లాన్. అందుకే ఏ సంఘటన జరిగినా జగన్ వెంటనే రాడు. కనీసం రెండు మూడు రోజులు సమయం తీసుకుంటాడు. తాను ఎక్కడికి వస్తున్నాను అన్నది పార్టీ క్యాడర్ కి, సీనియర్ నేతలకి ముందే సమాచారం వెళుతుంది. ఎన్ని గంటలకి బయలుదేరుతాడు.... ఎన్ని గంటలకి చేరుతాడు ఇదంతా ఒక షెడ్యూల్ ప్రకారం వేసుకుంటారు. దానికి తగినట్లుగా జన సమీకరణ జరుగుతుంది. ఇది ఇప్పటినుంచి కాదు జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పటి నుంచి ఇదే వ్యూహం అమలవుతుంది.
ఏ చిన్న సందర్భం అయినా దానిని ఒక ఐదు ఆరు గంటలు ప్రోగ్రామ్ గా మలచడం జగన్ వ్యూహంలో భాగం. వినే వాళ్ళకి చూసే వాళ్ళకి... యావగింపుగా అనిపించొచ్చు. కానీ నాకు జన బలం ఉంది... అని చూపించడం జగన్ ప్రధాన లక్ష్యం. జగన్ ఎక్కడికి వెళ్ళినా వేలల్లో వస్తున్న జనం అంతా నిజంగా జనం జగన్ పై అభిమానంతోనే వస్తున్నారా లేక పార్టీ నాయకులు తీసుకొస్తున్నారా అనేదానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. కచ్చితంగా జిల్లా నాయకులు, ఏరియా లీడర్లు జనాన్ని సరఫరా చేస్తారు. అలాగే జగన్ వస్తున్నాడని మూడు నాలుగు రోజులు ముందే చెప్పడంతో జనం కూడా వెర్రిగా ఆయన చూడ్డానికి వేలల్లో వచ్చేస్తూ ఉంటారు. వచ్చింది జనానికి నాయకులు తిండి లిక్కర్ ఇతర ఇతర సరఫరా చేస్తూ ఉంటారు. అన్ని జరుగుతాయి ఇక్కడ. మరికొందరు నిజంగా అభిమానంతోనే వస్తారు. ప్రధానంగా గరు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వెర్రిగా జగన్ చూడడానికి తరలివస్తుంటారు.
అరగంటలో చేరుకోవాల్సిన దూరాన్ని ఆరేడు గంటల పాటు కొనసాగిస్తారు. ఇదంతా టీవీల్లో ప్రసారమవుతుంది. జనం చుట్టూ ఉన్న ఆ వేల మంది జనాన్ని చూసి జగన్కు విపరీతమైన జనాధారణ ఉంది అనే అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్తుంది. జగన్ ఆరు గంటల పాటు జనంలో నిదానంగా కదులుతూ కెమెరాలకు అనుగుణంగా విజువల్స్ ఇస్తూ.... ఒక సాదాసీదా పరామర్శని ఆరేడు గంటలు షోగా చేస్తాడు. ఈ రోడ్ షో ని డ్రోన్ విజువల్స్ తోను, వేరే కెమెరాలతో కూడా తీసి ఆ విజువల్స్ ఎప్పటికప్పుడు మీడియాకు పంపుతూ ఉంటారు. ఇదంతా జగన్ అంటే జనంలో ఒక పిచ్చి అనే అభిప్రాయం కలిగించడానికి.ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ రోడ్డు కార్నర్స్ మీటింగులు పెట్టడం ద్వారా కిక్రిసిపోయిన జనాన్ని కెమెరాలు లో చూపించి సక్సెస్ అయింది వైసిపి.అలాగే సిద్ధం సభల్లో ర్యాంపు స్టేజి పై జగన్తో రాంప్ వాక్ చేయించడం.... చుట్టూ వేలాది మంది జనం పోగుపడడం.... అది లక్షల్లాగా కెమెరా లో కనిపించడం ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగేది. ఇదే టెక్నిక్ ని ఇప్పుడు భారతదేశంలో అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి.
నిజంగానే జగన్ ఎక్కడికైనా వెళ్తే ఇలా వేలల్లో, లక్షల్లో జనం వచ్చి మీద పడిపోయేటట్లయితే, ప్రతివారం ఇంటి నుంచిఎయిర్పోర్ట్ కు వెళ్తాడు కదా మరి అప్పుడు కూడా.... ఆరేడు గంటల సమయం పడుతుందా? అదేం లేదు కదా. జగన్ ప్రతివారం 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అలాగే బెంగళూరులోనూ యలహంక లోని తన ఇంటికి 20 నిమిషాల్లో చేరుకుంటారు. అంటే ఒక పథకం ప్రకారం జనాన్ని సమీకరిస్తేనే ఇలా వేళల్లో లక్షల్లో జనం వచ్చి మీద పడతారు. ఇదే టెక్నిక్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చినప్పుడు టిడిపి ప్రదర్శించింది. సక్సెస్ అయింది కూడా. మొత్తం మీద జగన్ ఎవరి ఇంటికి పరామర్శకు వచ్చిన ఆరు ఏడు గంటల రోడ్ షో తప్పదు.