మాజీ ముఖ్యమంత్రి, 91 ఏళ్ల నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఒక ఏడాది క్రితం వరకు చురుగ్గానే తిరిగిన నాదెండ్ల.... ఇటీవలే మంచాన్న పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నెల ముఖ్యమంత్రిగా ముద్రపడిన నాదెండ్ల ఒక తెలివైన... సమర్ధుడైన నాయకుడిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించి చివరికి చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. దానికి కారణం 1984 లో స్వర్గీయ ఎన్ టి రామారావు ప్రభుత్వాన్ని ఆయన కూల్చివేయడమే.
1935 లో గుంటూరు జిల్లాలో పుట్టిన నాదెండ్ల భాస్కర రావు.... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి ఎ ,ఎల్ ఎల్ బి చేసేరు. న్యాయవాద వృత్తిలో రాణించారు.1978లోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి హేమహేమీలు మొదటిసారి ఎమ్మెల్యేలు గా అసెంబ్లీలో అడుగు పెట్టారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే.. నాదెండ్ల.... చెన్నారెడ్డి, అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, నాదెండ్ల ఒకే క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. న్యాయ కోవిదుడు కావడం, ఆంగ్ల పరిజ్ఞానం... భాస్కర్ రావుకు బాగా కలిసి వచ్చాయి. చెన్నారెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కమర్షియల్ టాక్స్ మంత్రిగా తెర వెనుక చక్రం తిప్పారు నాదెండ్ల.1982లో ఎన్టీఆర్ టిడిపి స్థాపించినప్పుడు భాస్కర్ రావు కాంగ్రెస్ ని వదిలి అన్నగారి వెంట వచ్చాడు. పార్టీలో నెంబర్ టు గా ఎదిగాడు.1983లో టిడిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కైవసం చేసుకుంది. నాదెండ్ల ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. నేటి టిడిపి అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అప్పటికి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి ఆయన ప్రభుత్వాన్ని పడేయడానికి నాదెండ్ల కాంగ్రెస్ తో కలిపి పథక రచన చేశారు. ఇది తెలిసి ఎన్టీఆర్ ఇండియా తిరిగి రాగానే నాదెండ్లనీ మంత్రివర్గం నుంచి తొలగించారు. కానీ నాదెండ్ల మరికొందరు టిడిపి ఎమ్మెల్యేలను కలుపుకొని, కాంగ్రెస్ సహకారంతో 1984 ఆగస్టు 16న ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. గవర్నర్ రామ్ లాల్, ప్రధాని ఇందిరాగాంధీ సహకారంతో మొత్తం వ్యవహారం నడిపించారు. తనకి 163 మంది సభ్యుల బలం ఉందని, ఎన్టీఆర్ లకు జాబితాలు విడుదల చేసిన ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నల్ల బట్టలు వేసుకొని జనంలోకి వెళ్లారు.
రెండు రాష్ట్రాలు ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయంపై రగిలిపోయాయి. జనం రోడ్లపైకి వచ్చి గవర్నర్ రామ్ లాల్ కి ,ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. నెల రోజులు పాటు ఏపీ అట్టుడికి పోయింది. ఉద్యమానికి తలవంచి సరిగ్గా నెల రోజులకి సెప్టెంబర్ 16న నాదెండ్ల ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. చరిత్రలో ఇలాంటి సంఘటన దేశంలో ఇంకెక్కడ జరగలేదు. గవర్నర్ రామ్ లాల్, ప్రధాని ఇందిరాగాంధీ పరువు పోగొట్టుకున్నారూ. అయితే ఎన్టీఆర్ ఇంతటితో తృప్తి చెందలేదు.ఏకంగా ప్రభుత్వాన్ని రద్దుచేసి 1985లో మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. నాదెండ్ల భాస్కరరావు కూడా ప్రజాస్వామ్య తెలుగుదేశం అనే పార్టీని పెట్టి ఎన్నికల బరిలో దిగారు. ఎన్టీ రామారావు అత్యధిక మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రి అయితే, నాదెండ్ల భాస్కరరావు ఒక్క సీటు కూడా గెలుచుకోలేక అత్యంత దారుణంగా ఓడిపోయారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఈ సంఘటనతో నాదెండ్ల భాస్కరరావు చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు.
1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1998లో కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు కానీ ఏడాదిపాటే ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ ను విడిచిపెట్టి బిజెపిలో చేరారు. నాదెండ్ల భాస్కర్ రావు పొలిటికల్ కెరీర్ ముగిసిపోయింది. నాదెండ్ల కుమారుడు మనోహర్ ఏపీ కూటమి సర్కార్లో సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్పీకర్ గా కూడా పనిచేశారు. ఏది ఎలా ఉన్నప్పటికీ.... ఎన్టీ రామారావు గవర్నమెంట్ ని అత్యంత దారుణంగా పడగొట్టి తాను ముఖ్యమంత్రిని అవ్వాలని అత్యాశలో నాదెండ్ల భాస్కరరావు చరిత్రలో ఒక జోకర్ పొలిటిషన్ గా, విలన్ గా మిగిలిపోయాడు. కాంగ్రెస్ సహకారంతో కొన్నాళ్లు పాలిటిక్స్ లో మనగలిగినప్పటికీ దృష్టిలో మాత్రం నాదెండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి ఎప్పటికీ ఒక పొలిటికల్ విలన్ మాత్రమే. విద్యార్హతలు, అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉన్నప్పటికీ ఎన్టీ రామారావుని కూల దొయాలని కుటీల ప్రయత్నం చేసి చివరికి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు నాదెండ్ల భాస్కర్ రావు.