Top stroy:పుతిన్‌‌ను లేపేయడానికి జెలెన్‌స్కీ… ప్లాన్ గూఢచారిని రెచ్చగొట్టారు.. ఇక రచ్చ రచ్చే…!

నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలంటే ఏం చేయాలి? ఒకటి ఏదో ఒక దేశం నాశనమవ్వాలి, ఉక్రెయిన్, రష్యా అధ్యక్షుల్లో ఎవరో ఒకరు అంతమైనా అవ్వాలి. ట్రంప్ ఎంట్రీతో అమెరికా మద్దతు ఆగిపోయిన తర్వాత జెలెన్‌స్కీ

Post Published By: dialnews
Updated : 11 May 2026, 2:48 PM IST

నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలంటే ఏం చేయాలి? ఒకటి ఏదో ఒక దేశం నాశనమవ్వాలి, ఉక్రెయిన్, రష్యా అధ్యక్షుల్లో ఎవరో ఒకరు అంతమైనా అవ్వాలి. ట్రంప్ ఎంట్రీతో అమెరికా మద్దతు ఆగిపోయిన తర్వాత Volodymyr Zelenskyyఈ రెండో ఆప్షనే ఎంచుకున్నాడు. పుతిన్ అడ్డుతొలగించుకుంటే రష్యాను ఓడించొచ్చు అని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే కాదు, పుతిన్‌ను ఎలిమినేట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు. కానీ, ఆ ప్లాన్‌ను అమలు చేయడంలోనే ఫెయిల్ అయ్యాడు. అదే జెలెన్‌స్కీ చేసిన అతిపెద్ద మిస్టేక్ కాబోతోందిప్పుడు. తాజాగా ఈ వివరాలనే యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. ఈ రిపోర్టుల్లో కేవలం ఉక్రెయిన్ కుట్రలే కాదు.. రష్యాలో అంతర్గత కుట్ర భయాలూ ఉన్నాయని చెప్పింది. ఈ సంవత్సరం మార్చి నుంచి రష్యాలోని అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్.. హై అలర్ట్‌లో ఉందని యూరోపియన్ నిఘా నివేదికలు చెప్పాయి.

యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు.. పుతిన్ తన రాజకీయ ఎలైట్ సభ్యుల నుంచే తనపై డ్రోన్లతో హత్యాయత్నం జరగవచ్చని భయపడుతున్నట్లు తెలిపాయి. అందువల్ల ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతా చర్యలను భారీగా పెంచిందట. కొత్తగా క్రెమ్లిన్ దగ్గర్లోని సిబ్బంది ఇళ్లలో సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పుతిన్‌తో పనిచేసే వంటవాళ్లు, బాడీగార్డులు, ఫొటోగ్రాఫర్లు ఎవరూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించకూడదనీ, FSO వాహనాలు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్రెమ్లిన్ భవనంలోకి వచ్చే సందర్శకులందరికీ.. రెండుసార్లు స్క్రీనింగ్ చేయాలనీ.. దగ్గర్లోని సిబ్బంది ఇంటర్నెట్ లేని ఫోన్లు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించిట్లు CNN రిపోర్టులు స్పష్టం చేశాయి.పుతిన్, ఆయన కుటుంబం ఇప్పుడు.. రష్యా రాజధాని మాస్కో ప్రాంతం, వాల్డాయ్ నివాసాలకు వెళ్లడం ఆపేశారు. అంతేకాదు.. ఈ ఏడాది ఎలాంటి మిలిటరీ సౌకర్యాలనూ సందర్శించలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్.. క్రాస్నోడార్‌లోని అప్‌గ్రేడెడ్ బంకర్లలో వారాల తరబడి ఉంటున్నారట. ప్రజలకి డైరెక్టుగా కాకుండా.. ముందుగానే రికార్డ్ చేసిన ఫుటేజ్ విడుదల చేస్తున్నారని యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ హత్య తర్వాత క్రెమ్లిన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్, FSB హెడ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్, నేషనల్ గార్డ్ హెడ్ విక్టర్ జోలోటోవ్ మధ్య వివాదాలు చెలరేగాయి. పుతిన్ ఆ వివాదాలు సద్దుమణిగేలా చేశారు. అలాగే 10 మంది సీనియర్ జనరల్స్‌కు FSO భద్రతా వ్యవహారాలను అప్పగించారు. ఇలా ఆయన తన నివాసంలో అడుగడుగునా హై సెక్టూరిటీ ఉండేలా చేసుకుంటున్నారని యూరోపియన్ నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ డిఫెన్స్ మినిస్టర్, ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయుగు.. పుతిన్ హత్యకు కుట్ర జరిగే అవకాశం ఉంది అని తెలిపారు. తన సన్నిహితుడు రుస్లాన్ త్సాలికోవ్ అరెస్టు తర్వాత ఈ భయాలు పెరిగాయి. రష్యా ఎలైట్‌ నేతల మధ్య సఖ్యత లేదనీ, ఒకరి పట్ల ఒకరికి చాలా విబేధాలు ఉన్నాయనీ.. ఆర్థిక సమస్యలు కూడా నేతల మధ్య విబేధాలకు కారణం అయ్యాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి.

పుతిన్ భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనదిగా ఉంటుంది. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అధికారులు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, భారీ బంకర్లు, మల్టిపుల్ స్క్రీనింగ్ ప్రక్రియలతో పుతిన్‌ను శత్రువులు టచ్ చేయలేని విధంగా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అంతర్గత భయాలు, లీక్స్, డ్రోన్ దాడుల భయం కారణంగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆ నివేదికలు చెబుతున్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ రిపోర్టులను ఖండించినా, అదనపు భద్రతా చర్యలు ఉన్నట్లు అంగీకరించారు. యూరోపియన్ ఇంటెలిజెన్స్ నిఘా నివేదికల్లో కొన్ని నిజాలు ఉన్నమాట వాస్తవమే కావచ్చు.. కానీ, తనపై హత్యాయత్నం విషయంలో పుతిన్ భయపడుతున్నారు అన్నది నిజం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే, పుతిన్ రష్యా అధ్యక్షుడి కంటే ముందు కేజీబీ గూఢచారి. సీక్రెట్ ఏజెంట్లు శత్రువులకు ప్రాణ భయం రుచిచూపిస్తారు తప్ప తమ ప్రాణాల కోసం భయపడరు. పుతిన్ అస్సలు భయపడే రకం కాదు. భయపడే వ్యక్తే అయితే అమెరికా, పాశ్చాత్య దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలబడినప్పుడే భయడేవారు. విక్టరీ డే కారణంగా మూడు రోజుల కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ విరామం తర్వాతే పుతిన్ మార్క్ విధ్వంసం మొదలవ్వబోతోంది.

Published : 
  • 11 May 2026, 2:48 PM IST