సూర్యా భాయ్ కు గాయం టెస్ట్ క్రికెట్ లోకి కష్టమే

రెడ్ బాల్ క్రికెట్ లోకి మళ్ళీ అడుగుపెట్టాలనుకుంటున్న భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది.

Post Published By: Vencateshg
Updated : 31 August 2024, 5:55 PM IST

రెడ్ బాల్ క్రికెట్ లోకి మళ్ళీ అడుగుపెట్టాలనుకుంటున్న భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ సందర్భంగా సూర్యకుమార్ గాయపడ్డాడు. అతని చేతికి గాయమైందని తెలుస్తోంది.
తమిళనాడుతో మ్యాచ్‌ లో కేవలం 30 పరుగులే చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో అతడు దులిప్‌ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టు రీఎంట్రీకి ఇప్పట్లో అవకాశం ఉండకపోవచ్చు. చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన టీమిండియా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతోంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

Published : 
  • 31 August 2024, 5:55 PM IST