టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియాకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వార్నింగ్ ఇచ్చాడు . సెమీ ఫైనల్ లేదా ఫైనల్స్ లో మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ పడకుండా, దేవుళ్లకు మొక్కుకోండి అంటూ మాట్లాడాడు. ఒకవేళ మ్యాచ్ పడితే, మాత్రం చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించాడు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. పాక్, కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ కు వార్నింగ్ ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోసారి పాకిస్తాన్ తో మ్యాచ్ జరగకుండా ఇండియన్స్ దేవుళ్లను ప్రార్థించుకోవాలని వ్యాఖ్యానించాడు.టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ లేదా ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజీ స్పందించాడ. ఫైనల్ లేదా సెమీ ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, టీమిండియాలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఇంజమామ్ ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు.
గ్రూప్ స్టేజ్ లో మా వాళ్లు సరిగ్గా ఆడలేదనీ ఈ సారి కసితో ఆడుతారు అంటూ పాక్ జట్టును వెనకేసుకొచ్చాడు. అందుకే ఈ సారి జీవితంలో మర్చిపోలేని ఓటమిని రుచి చూపిస్తామని హెచ్చరించాడు. అయితే ఇంజమామ్ కామెంట్స్ పై భారత్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. గత 8 ప్రపంచకప్ లుగా పాక్ ఆటతీరు ప్రపంచం చూస్తూనే ఉందంటూ గుర్తు చేస్తున్నారు. ఎప్పుడెలా ఆడతారో తెలియని పాక్ తో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో పోలికా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో భారత్ పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.