టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి ఈ సిరీస్ ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. అయితే గాయం కారణంగా అప్ఘాన్‌తో సిరీస్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీ20లు, గతేడాది టెస్టులకు వీడ్కోలు పలికాడు. టీ20 రిటైర్మెంట్ ఎలా ఉన్నా.. టెస్టులకు కోహ్లీ గుడ్ బై చెప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తనకు ఇష్టమైన ఫార్మాట్ రెడ్ బాల్ క్రికెట్ అని పదే పదే చెప్పే.. కోహ్లీ సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే ప్రశ్నలు వచ్చాయి.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ దీనిపై కోహ్లీ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పటికీ విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ .. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు తెలిసి కోహ్లీకి ఇంకా టెస్టు క్రికెట్లో ఆడే సామర్థ్యం ఉందన్నారు. ఎందుకు ఆ ఫార్మాట్‌ను అనూహ్యంగా వీడాల్సి వచ్చిందో తనకైతే అర్థం కాలేదన్నారు.
విరాట్‌లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందనీ అది కోపంలో తీసుకున్న నిర్ణయమేమో అని అనిపించిందన్నారు ఏది ఏమైనా.. ఆట విషయంలో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకూడదన్న కపిల్ సెలక్టర్లు ఎంపిక చేయకపోయినా సమస్య లేదన్నారు. కాస్త విరామం తీసుకుని తిరిగి రాణించాలనీ , కోహ్లీ నిర్ణయం తనను నిరాశపరిచిందంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో కోహ్లీ సృష్టించిన రికార్డులు చాలానే ఉన్నాయి. మొత్తం 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 9,230 పరుగులు చేయడంతో పాటు 30 సెంచరీలు బాదాడు. ఇక తన కెప్టెన్సీలో 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలతో టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు.