కోహ్లీ మరో 35 రన్స్.. ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్

సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై టెస్టులో విఫలమైన కోహ్లీ ఇప్పుడు కాన్పూర్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో అతను 37 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.

Post Published By: Vencateshg
Updated : 22 September 2024, 7:46 PM IST

సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై టెస్టులో విఫలమైన కోహ్లీ ఇప్పుడు కాన్పూర్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో అతను 37 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు. వరల్డ్ క్రికెట్ లో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో 27 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడు. సచిన్ 27 వేల పరుగులను 623 ఇన్నింగ్స్ లలో పూర్తి చేసుకుంటే... కోహ్లీ ప్రస్తుతం 593 ఇన్నింగ్స్ లలో 26 వేల 965 పరుగులు చేశాడు. దీంతో క్రికెట్ గాడ్ కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయి చేరుకోవడం ఖాయమైంది. కాగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో మొదలవుతుంది.

Published : 
  • 22 September 2024, 7:46 PM IST