భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ ? పాక్ క్రికెట్ బోర్డు కొత్త కుట్ర

టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని పాక్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 09:04 PMLast Updated on: Jan 27, 2026 | 9:04 PM

Match Boycott Against India The Pakistan Cricket Boards New Conspiracy

టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని పాక్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోందట. మొన్న బంగ్లాదేశ్ డిమాండ్లపై ఐసీసీ ప్రవర్తించిన తీరుపై పాకిస్తాన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టీమిండియా కు అదనంగా రెండు పాయింట్లు రానున్నాయి. ఇదిలా ఉంటే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.

ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం పెద్ద వివాదంగా మారింది. బంగ్లాదేశ్ లో హిందువులను చంపేస్తున్నారన్న ఒక్క కారణంతో ఐపీఎల్ ఆడకుండా ఆ దేశ క్రికెటర్ల పై బ్యాన్ విధించింది .అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రివేంజ్ తీర్చుకునేందుకు బంగ్లాదేశ్ కొత్త స్కెచ్ వేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ తిరకాసు పెట్టింది . శ్రీలంకలో తమ మ్యాచ్ లు ఆడతామని వెల్లడించింది. దీనికి ఐసిసి అస్సలు ఒప్పుకోలేదు.

బంగ్లాదేశ్ డిమాండ్లను పక్కకు పెట్టింది. ఇలాంటి తరుణంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమని బంగ్లాదేశ్ వైదొలిగింది . అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని ఒక్క కారణం చూపించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్రకు తెర లేపింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ బాయ్ కాట్ చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీమిండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే, పాకిస్తాన్ 2 పాయిట్లు కోల్పోనుంది.