రవితేజ ఇరుముడి ఆ మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేకా.. స్వామియే శరణం అయ్యప్ప..!

మాస్ మహారాజా ట్రాక్ మార్చాడు.. రవితేజ సినిమాలంటేనే మాస్ మసాలా, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన రూటు మార్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 08:35 PMLast Updated on: Jan 27, 2026 | 8:35 PM

Is Ravitejas Irumudi A Remake Of That Malayalam Super Hit Film

మాస్ మహారాజా ట్రాక్ మార్చాడు.. రవితేజ సినిమాలంటేనే మాస్ మసాలా, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన రూటు మార్చాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని పలకరించిన రవితేజ.. మరోసారి పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఎమోషనల్ డ్రామాలను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ చేతులు కలిపాడు. ఈ సినిమాకు ఇరుముడి అనే ఆసక్తికరమైన టైటిల్‌ను లాక్ చేశారు. టైటిల్ వినగానే ఇదొక ఆధ్యాత్మిక, భావోద్వేగ ప్రయాణమని అర్థమవుతోంది. తండ్రీ కూతుళ్ళ మధ్య హై ఎమోషనల్ డ్రామా ఇది. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే.. ఇది తండ్రీ కూతుళ్ళ మధ్య సాగే గుండె బరువెక్కించే కథగా రాబోతుంది. గతంలో శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో ఎమోషన్స్‌ను పండించడంలో తన సత్తా చాటాడు.

ఇప్పుడు రవితేజలోని ఎన్నడూ చూడని కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ హంగులకు దూరంగా.. కథను నమ్ముకుని రవితేజ చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ఇరుముడి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది. అయ్యప్ప మాల ధారణలో ఉన్న రవితేజ లుక్ చూడగానే. మలయాళంలో సూపర్ హిట్టయిన ఉన్ని ముకుందన్ సినిమా మాలికాపురం గుర్తుకు వస్తోంది. ఆ సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలు శబరిమల వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో.. వారికి అయ్యప్ప స్వామి రూపంలో ఒక వ్యక్తి సాయం చేస్తాడు. ఇప్పుడు రవితేజ పోస్టర్, టైటిల్ చూస్తుంటే… కొంపదీసి ఆ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరుముడి కూడా మైథాలజీ టచ్ ఉన్న కథే అని తెలుస్తుంది. మాలికాపురంలో దైవత్వం, మానవత్వం కలిసి ఉంటాయి.

రవితేజ సినిమాలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది డైరెక్ట్ రీమేకా లేక ఆ పాయింట్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కొత్త కథా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే కథ అయితే మాత్రం.. రవితేజ ఇమేజ్‌కు ఆ పాత్ర 100 శాతం సెట్ అవుతుందని, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మొత్తానికి మాస్ రాజా… అయ్యప్ప భక్తుడిగా, ఒక కూతురి తండ్రిగా చేస్తున్న ఈ ఎమోషనల్ జర్నీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరి ఇది ఒరిజినల్ కథో లేక మాలికాపురం రీమేకో తెలియాలంటే టీజర్ వచ్చేదాకా ఆగాల్సిందే..!