పనిమనిషితో ఆసీస్ మాజీ కెప్టెన్ ఎఫైర్.. భార్యకు రూ.300 కోట్ల భరణం
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న కారణాలవల్ల విడిపోవడం జరుగుతోంది. అదే సమయంలో భార్యకు కోట్లల్లో భరణాలు కూడా ఇస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న కారణాలవల్ల విడిపోవడం జరుగుతోంది. అదే సమయంలో భార్యకు కోట్లల్లో భరణాలు కూడా ఇస్తున్నారు. సమంత నుంచి మొదలుకొని ధనశ్రీ వర్మ వరకు చాలా మంది సెలబ్రిటీలు భరణం అందుకున్నారు. ఈ సెలబ్రిటీలు అందరూ మహా అంటే రూ.50 నుంచి 100 కోట్ల వరకు ఆ లోపే భరణం అందుకున్నారు. కానీ తన భార్యను వదిలించుకోవడానికి ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్.. 2020లో తన భార్యకు విడాకులు ఇచ్చిన మైఖేల్ క్లార్క్ ఏకంగా 300 కోట్లు తన భార్యకు భరణంగా ఇచ్చాడట.
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 2004 నుంచి దాదాపు 2015 వరకు ఆస్ట్రేలియా క్రికెట్ ను ఏలిన మైఖేల్ క్లార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి మైఖేల్ క్లార్క్ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2012 సంవత్సరంలో కైలీ క్లార్క్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే పెళ్లి అయిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలకు అంటే 2020లో మైఖేల్ క్లార్క్ జంట విడాకులు తీసుకుంది. మైఖేల్ క్లార్క్ తన పర్సనల్ అసిస్టెంట్ తో రిలేషన్ పెట్టుకున్నాడు.వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఆయన భార్య కైలీ పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మైఖేల్ క్లార్క్ కు కైలీ క్లార్క్ విడాకులు ఇచ్చింది. అయితే విడాకులు ఇచ్చిన నేపథ్యంలో తన ఆస్తి దాదాపు మొత్తం భరణంగా ఆయన భార్యకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కైలీ క్లార్క్ కు మొత్తం 300 కోట్లు భరణంగా చెల్లించి హాట్ టాపిక్ అయ్యారట మైఖేల్ క్లార్క్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైవర్స్ లలో మైఖేల్ క్లార్క్ విడాకులు నిలిచిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా తమ కూతురిని ఇద్దరూ ఆనందంగానే చూసుకుంటున్నట్టు సమాచారం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రస్తుత ఆస్తులు అధికారికంగా మాత్రం 185 కోట్లు అని తెలుస్తోంది. అయితే 2020లో 300 కోట్ల వరకు భరణంగా భార్యకు ఇవ్వడంతో మైఖేల్ క్లార్క్ ఆస్తులు మొత్తం తరిగిపోయినట్టు తెలుస్తోంది.











