ఐపీఎల్‌లో అమ్ముడుపోని డేవిడ్ వార్నర్‌తో పాటు ఫాఫ్ డు ప్లిసిస్, మొయిన్ ఆలీ, ఆడమ్ జంపా వంటి ప్లేయర్లు.. ఈసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నారు. ఫాఫ్ డు ప్లిసిస్‌ని ఐపీఎల్ 2025 వేలంలో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. తన రేంజ్‌కి ఇది చాలా తక్కువని భావించిన ఫాఫ్ డుప్లిసిస్, ఈసారి ఐపీఎల్ 2026 వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోలేదు.ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఇదే రకమైన కారణం చెప్పాడు. రూ.2 కోట్ల కోసం 2 నెలల సమయాన్ని ఐపీఎల్ కోసం వెచ్చించలేనని వ్యాఖ్యానించాడు ఆడమ్ జంపా. డేవిడ్ వార్నర్, ఎంత తక్కువ ఇచ్చినా ఐపీఎల్ ఆడాలని అనుకున్నాడు. ఐపీఎల్‌తో అతనికి ఉన్న అనుబంధం అలాంటిది. అయితే ఏ ఫ్రాంఛైజీ కూడా డేవిడ్ వార్నర్‌ని కొనుగోలు చేయడానికి ముందుకి రాలేదు.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, 2025 సీజన్‌లో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి ఆడాడు. అంతకుముందు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడిన మొయిన్ ఆలీ, 2026 వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకోలేదు.తాజాగా ఐపీఎల్ కాకుండా పీఎస్‌ఎల్ ఆడడానికి గల కారణాన్ని బయటపెట్టాడు.తనలో క్రికెట్ ఇంకా మిగిలే ఉందని గత సీజన్‌లో ఐపీఎల్ ఆడాననీ,. సగం మ్యాచుల్లో మాత్రమే అవకాశం వచ్చిందన్నాడు.అందులో రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాననీ చెప్పాడు.
కెరీర్ చివర్లో బ్యాటింగ్ ఎప్పుడు వస్తుందా? బౌలింగ్ ఎప్పుడు ఇస్తారా? అని వెయిట్ చేస్తూ ఉండలేనన్నాడు. ఐపీఎల్‌తో పోలిస్తే పీఎస్‌ఎల్లో ప్లేస్‌కి గ్యారెంటీ ఉంటుందన్నాడు, ఆటను ఎంజాయ్ చేసే టైమ్ ఉంటుంది తనకు, తుది జట్టులో ప్లేస్ దొరుకుతుందా? లేదా? బౌలింగ్ వస్తుందా? లేదా? బ్యాటింగ్ ఇస్తారా? లేదా? అనే టెన్షన్లు ఉండవు.’ అంటూ కామెంట్ చేశాడు ఐపీఎల్ కెరీర్‌లో 73 మ్యాచులు ఆడిన మొయిన్ ఆలీ, 1167 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 41 వికెట్లు పడగొట్టాడు 2018 నుంచి 3 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన మొయిన్ ఆలీ, ఆ తర్వాత 2021 నుంచి 2024 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరుపున ఆడాడు. 2025లో కేకేఆర్ తరుపున ఆడాడు.