Ruturaj Gaikwad: ఓపెనర్లు ఎవరు..? తెరపైకి సరికొత్త జోడీ..!

ఐర్లాండ్‌తో సిరీసులో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీ ఆడటం ఖాయమైంది. ఈ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తీసుకోనున్నారు. లేదంటే సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 17 August 2023, 4:02 PM IST

Ruturaj Gaikwad: గాయంతో 14 నెలలపాటు జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్ సిరీస్ శుక్రవారం ప్రారంభం అవనుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌‌లో కొత్త ఓపెనింగ్ జోడీతో భారత జట్టు బరిలోకి దిగనున్నట్లు సమాచారం. శుభ్‌మన్ గిల్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతనితోపాటు ఇషాన్ కిషన్‌కు కూడా ఈ సిరీసులో చోటు దక్కలేదు. దీంతో ఐర్లాండ్‌తో సిరీసులో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ జోడీ ఆడటం ఖాయమైంది. ఈ బాధ్యతలను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తీసుకోనున్నారు. లేదంటే సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

యశస్వి జైస్వాల్, గైక్వాడ్ జోడీతో ఓపెనింగ్ చేయిస్తే.. మిడిలార్డర్‌లో, తిలక్ వర్మ, రింకూ సింగ్ తదితరులు ఆడతారట. అలాగే వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఇద్దరికీ ఆల్‌రౌండర్లుగా ఛాన్స్ దక్కనుందట. దూబే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ల వైపే టీం మేనేజ్‌మెంట్ చూస్తున్నట్లు సమాచారం. గాయాల నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ కన్ఫమ్‌గా ఆడనున్నారు. వీరితోపాటు అర్షదీప్ సింగ్ ఆడతాడు. సీనియారిటీ ప్రకారం ఈ ముగ్గురికీ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే స్పిన్ బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయి ఆడటం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ బాధ్యతలను వాషింగ్టన్ సుందర్ కూడా పంచుకునే అవకాశం ఉంది.

Published : 
  • 17 August 2023, 4:02 PM IST