Virat Kohli: మరోసారి తండ్రైన కోహ్లీ.. కొడుకు పేరేంటో తెలుసా..

ఫిబ్రవరి 15న తేదీన అనుష్క శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు అకాయ్ అని పేరు పెట్టారు. అనుష్క శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు.. ఇప్పటికే వామిక మొదటి సంతానం ఉంది.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 9:28 PM IST

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 15న తేదీన అనుష్క శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు అకాయ్ అని పేరు పెట్టారు. అనుష్క శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు.. ఇప్పటికే వామిక మొదటి సంతానం ఉంది.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. కోహ్లీకి కొడుకు పుట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుష్క దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కోహ్లీ దంపతులకు విషెస్ చెప్తున్నారు. ఆనందం నిండిన గుండెలతో మీకీ విషయం చెప్తున్నానని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చిన అనుష్కశర్మ.. కొడుక్కి అకాయ్ అని పేరు పెట్టామని చెప్పింది. తన కొడుకుకు మీ అందరి విషెస్ కావాలి అంటూ.. ఎమోషనల్‌ పోస్ట్ రాసుకొచ్చింది. అకాయ్ తమ జీవితంలోకి రావడం.. చాలా ఆనందంగా ఉందని.. ఇదో అద్భుతమైన విషయం అంటూ ఎమోషనల్ అయింది అనుష్క శర్మ.

ఇలాంటి సమయంలో అభిమానులు అందరూ.. తమ ప్రైవసీని గౌరవించాలని విన్నవించుకుంటున్నట్లు రాసుకొచ్చింది అనుష్క. ఐతే కొడుకు ఫొటోను మాత్రం విరుష్క దంపతులు ఇంకా చూపించలేదు. అనుష్క శర్మ పోస్టుకు.. అభిమానులు ఆనందంతో క్రియేటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు. జూనియర్ పులి వచ్చిందని కొందరు.. డాన్స్‌ చేస్తున్న ఎమోజీలు షేర్ చేస్తూ మరికొందరు.. న్యూ లెజెండ్ ఆగయా అంటూ ఇంకొందరు.. కామెంట్లు పెడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Published : 
  • 20 February 2024, 9:28 PM IST