భారత స్టార్ క్రికెటర్లు కృనాల్ పాండ్యా- హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణంగా మెదిలిన ఈ అన్నదమ్ములు.. తాజాగా పరస్పరం ఎదురుపడినా పెద్దగా పలకరించుకోకపోవడం ఇందుకు కారణం. ఐపీఎల్-2026లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కృనాల్ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నా.. ఇరుజట్లు ముఖాముఖి తలపడినపుడు అన్నదమ్ములు ఆప్యాయంగా మెలగడం గతంలో కనిపించేది.
అయితే తాజా ఎడిషన్‌లో ఇటీవల ముంబైతో ఆర్సీబీ తలపడగా.. హార్దిక్ అవుటైన సమయంలో కృనాల్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ తోబుట్టువులు ఎడముఖం- పెడముఖంగానే కనిపించారు. ఇక హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ఇటీవల వీరి తల్లిని కలిసింది. ఆ సమయంలో కృనాల్ కుటుంబం కూడా ఆమెతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హార్దిక్ నటాషా నుంచి విడిపోయిన కొన్నాళ్లకే మహీక శర్మ అనే మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు నటాషాతో తనకు కలిగిన కుమారుడు అగస్త్యను కూడా మహీకకే అప్పగించినట్లుగా వదంతులు వస్తున్నాయి.
ఈ పరిణామాలే పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహీక విషయంలో కృనాల్ హార్దిక్‌పై సీరియస్‌గా ఉన్నాడని వాటి సారాంశం. ఈ విషయం గురించి తాజాగా కృనాల్ పాండ్యా నర్మగర్భంగా స్పందించాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భాగంగా హోస్ట్ డానిష్ సైత్ కృనాల్ పాండ్యాను పరోక్షంగా హార్దిక్ గురించి అడిగాడు. ‘అంతా ఒకేనా? ఏదైనా యుద్ధం జరుగుతోందా అని ప్రశ్నించాడు. ఇందుకు కృనాల్ గట్టిగా నవ్వేశాడు తప్ప బదులివ్వలేదు. కాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విజయం తర్వాత హార్దిక్‌కు కృనాల్ శుభాకాంక్షలు చెప్పలేదు. అదే విధంగా కృనాల్ బర్త్‌డేకు హార్దిక్ విష్ చేయలేదు.