ఇలా ఆడితే ఇంకేం చెప్పాలి ? వరుస ఓటములపై హార్థిక్ పాండ్యా…!

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి గత రెండేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ గెలిచినా, ముంబై కథ మారలేదు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన హార్దిక సేన, వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది.

Post Published By: dialnews
Updated : 18 April 2026, 12:50 PM IST

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి గత రెండేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ గెలిచినా, ముంబై కథ మారలేదు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన హార్దిక సేన, వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. పంజాబ్ కింగ్స్‌తో కమ్ బ్యాక్ ఇస్తారనుకుంటే మళ్లీ అదే పాత కథ రిపీట్ అయింది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడు.వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. 200కు పైగా స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా అవుటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.

ఈ స్కోర్‌ను డిఫెండ్ చేసి తొలి విజయం సాధించాలి అనుకున్న ముంబైకి పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరూ అద్భుత బ్యాటింగ్ చేసి 16.3 ఓవర్లలోనే 198 పరుగులతో ముంబైని చిత్తు చేశారు.ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చెప్పడానికి కూడా ఏం లేదనీ, ఎక్కడ తప్పు చేస్తున్నామో మళ్లీ ఇంకోసారి ఆలోచించుకోవాలన్నాడు. ఒక పర్సన్ సమస్య, లేక జట్టు సమస్యా.. లేదా ప్లానింగ్‌లోనే లోపం ఉందా అనేది తెలుసుకోవాలన్నాడు.

బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్న హార్థిక్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలా? లేక ఇదే టీమ్‌తో ముందుకు వెళ్లాలా అనేది కూడా నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించాడు. పాండ్యా కామెంట్స్ చూస్తే వరుసగా ఫెయిలవుతున్న ప్లేయర్స్ ను తర్వాతి మ్యాచ్ కు తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ టాప్ ప్లేయర్లతో నిండిన ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్‌లో ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైతే, మరో మ్యాచ్‌లో బ్యాటర్లు విఫలమవుతున్నారు. పంజాబ్‌పై ఓటమి తర్వాత జట్టులో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Published : 
  • 18 April 2026, 12:50 PM IST