Spl story: టీమిండియా కి నువ్వు అవసరమా ? 7 మ్యాచ్ లు…. 6 డకౌట్లు అభిషేక్ శర్మ ఇంటికి వెళ్ళిపోవడం మంచిదా?

టీమిండియా టి20 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కి ఏమైంది. ?ఓపెనర్ గా దిగుతాడు.... రెండు డాట్ బాల్స్ ఆడతాడు. ఆ ఫ్రస్టేషన్లో సునాయాసంగా క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 8:15 PM IST

టీమిండియా టి20 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కి ఏమైంది. ?ఓపెనర్ గా దిగుతాడు.... రెండు డాట్ బాల్స్ ఆడతాడు. ఆ ఫ్రస్టేషన్లో సునాయాసంగా క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. ఒకటి.... రెండు సార్లు కాదు ఏడు టి20 లో ఆరు
సార్లు డక్ ఔట్ అయి చరిత్ర సృష్టించాడు అభిషేక్. అందులో మూడు వరస డకౌట్లు. అమెరికా నెదర్లాండ్స్ లాంటి చిన్న దేశాలపై కూడా బ్యాటింగ్ చేయలేక చతికెలబడి పోతున్నాడు అభిషేక్.

అభిషేక్ శర్మ పేరు వినగానే సిక్సర్లు బౌండరీలు మాత్రమే కనిపిస్తాయి. ఒక రెండు మ్యాచ్ల్లో అభిషేక్ బాదుడు చూసి మనకి మరో యువరాజ్ సింగ్ దొరికేశాడు... ఇక పదేళ్ల వరకు తిరుగులేదు అని అభిని ఆకాశానికి ఎత్తేశారు. ఆసియా కప్ లో అభిషేక్ విశ్వరూపం చూసి కోట్ల మంది ఫ్లాట్ అయిపోయారు. అయితే టి20 వరల్డ్ కప్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసాడు అభిషేక్. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఒక్క రన్ కూడా చేయకుండా పెవిలియన్ దారి పెట్టాడు. ఏరి కోరి అభిషేక్ శర్మని టి20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేస్తే సెలెక్టీర్ల నమ్మకాన్ని వమ్ము చేశాడు. టి20 వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచ్లు అభిషేక్ డక్ అవుట్ అవ్వడం ఒక రికార్డు. మొదట నమీబియా కడుపునొప్పితో ఆడలేక పోయిన అభిషేక్ ఆ తర్వాత మూడు మ్యాచ్లు లో అవుట్ అయిన తీరు చూస్తే గల్లీ క్రికెటర్ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఆడడు అనిపించింది

అమెరికా తో మ్యాచ్ లో అభిషేక్ ఇరగదీస్తాడని..30 బాల్స్ లో సెంచరీ కొడతాడని అందరూ ఊహించారు. కానీ దారుణంగా డక్ ఔట్ అయ్యాడు. పాకిస్తాన్ మ్యాచ్ లో అయితే అభిషేక్ క్యాచ్ ఇచ్చిన తీరు చూసి క్రికెట్ ఫాన్స్ గుండెలు జారిపోయాయి. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అదే పరిస్థితి. ప్రతి మ్యాచ్ లోను మిగిలిన బ్యాట్స్మెన్ లో ఎవరో ఒకరు క్లిక్ అవడంతో ఇండియా గట్టెక్కింది.అసలు బంతిని పూర్తిగా అంచనా వేయకుండా, కేవలం రిస్ట్ పవర్నీ నమ్ముకొని బంతిని గాల్లోకి లేపేయడమే అభిషేక అసలు సమస్య.

మూడు బాల్స్ డిఫెన్స్ ఆడాల్సి వస్తే... పరుగులు ఏమి చేయకపోతే... ఫ్రస్టేషన్లో పడిపోవడం... సిక్సర్ కోసం ట్రై చేసి బౌండరీ దగ్గర దొరికిపోవడం మన వాడికి అలవాటైపోయింది. అసలు పిచ్ పై కుదురుకొని, దాని స్వభావం ఏమిటో చూసి ఆ తర్వాత చెలరేగి ఆడాలని కామన్ సెన్స్ ని మిస్ అయిపోతున్నాడు. కుదురుగా ఆడాలన్న వ్యూహం కన్నా హీరోఇజం చూపించాలి, నేను ఇలాగే ఆడతా అనే ట్రాన్స్లోకి వెళ్లిపోయినట్టున్నాడు అభిషేక్. దీంతో టోర్నీ ప్రారంభంలో అతనిపై ఉన్న అంచనాలు క్రమంగా మారిపోయాయి. వరుసగా మూడుసార్లు డక్ ఔట్ అయిన అభిషేక్, మాజీ బౌలర్ ఆసీస్ నెహ్ర సరసన నిలిచాడు. కాకపోతే అభిషేక్ వరస మూడు మ్యాచ్ లలో డక్ ఔట్ అయ్యాడు. మొత్తం ఇప్పటివరకు
40 టి20 లు ఆడిన అభిషేక్ ఆరుసార్లు డక్ అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ లో వరుసగా మూడుసార్లు శర్మ జి కా బేటా ఇలా డక్ ఔట్ అయిపోవడంతో మెగా టోర్నీలో ఇంత నిర్లక్ష్యంగా ఆడడం ఏంటని టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కీలకమైన సూపర్ 8 లో అభినీ పక్కన పెట్టి సంజు సాంసంగ్ తిరిగి జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

 

Published : 
  • 20 February 2026, 8:15 PM IST