వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు మంచి అంచనాలు ఏర్పడినప్పటికీ, రిలీజ్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఆ జోష్ బయట పెద్దగా కనిపించడం లేదు. అసలు ఈ చిత్రంలో వెంకీని దర్శకుడు ఎలా చూపించబోతున్నాడు అనేదానిపై సరైన క్లారిటీ ఇంకా రాలేదు.
ఇప్పటివరకు విడుదలైన టైటిల్ గ్లింప్స్, చిట్టిబాబు పాత్ర పరిచయ వీడియోలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయలేకపోయాయి. శ్రీనిధి శెట్టి మరియు పిల్లల పోస్టర్లు వచ్చినప్పటికీ, ఏదీ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునేలా లేవు. త్వరలో వచ్చే గట్టి ట్రైలర్ లేదా టీజర్‌తోనే ఈ సినిమాపై అసలైన అంచనాలు పెరిగే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాకి సంబంధించి పాటల ప్రమోషన్లు కూడా ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి క్యాచీ సాంగ్ పడితే ప్రమోషన్స్‌కు కాస్త ఊపు వస్తుంది. టైటిల్‌కు భిన్నంగా ఉన్న ఆ మిస్టరీ ఏంటనే విషయంపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు మేకర్స్ అక్టోబర్ 2న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ, సినిమా అక్టోబర్ 9 లేదా 16కి వెళ్ళవచ్చనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు టీమ్ నుంచి ఎలాంటి కొత్త రిలీజ్ డేట్ ప్రకటన రాలేదు కాబట్టి గందరగోళం నెలకొంది. ఒకవేళ అక్టోబర్ 2నే కనుక సినిమా ఫిక్స్ అయితే ప్రమోషన్లకు చాలా తక్కువ రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.